Interstate thief arrested : తమిళనాడు నుంచి వచ్చి తిరుపతి పరిసర ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నఅంతరాష్ట్ర దొంగను తిరుపతి జిల్లా పాకాలలో పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 334గ్రాముల బంగారం, 570గ్రాముల వెండి, ల్యాప్ టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లాకు చెందిన రాఘవన్ విజయ్ గతంలో దొంగతనాల కేసుల్లో పదేళ్లు జైల్లో శిక్ష అనుభవించాడని చెప్పారు.
పాకాల మండలంలో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్ - AP latest news
Interstate thief arrested : తమిళనాడు నుంచి వచ్చి తిరుపతి పరిసరప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్నఅంతరాష్ట్ర దొంగను తిరుపతి జిల్లా పాకాలలో పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లాకు చెందిన రాఘవన్ విజయ్ అని, అతను గతంలో దొంగతనాల కేసుల్లో పదేళ్లు జైల్లో శిక్ష అనుభవించాడని సీఐ రాజశేఖర్ చెప్పారు.
అంతరాష్ట్ర దొంగ అరెస్ట్
ఈ మధ్య విడుదలైన విజయ్ తిరుపతి జిల్లాను టార్గెట్ చేసి వరుస చోరీలకు పాల్పడ్డాడని..ఇతని పై ఇప్పటికే 8 కేసులు ఉన్నాయని చెప్పారు. దామలచెరువు-నేండ్రగుంట రోడ్డు మార్గంలోని దేశిరెడ్డిపల్లి వద్ద రాఘవన్ విజయ్ ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సీఐ రాజశేఖర్ చెప్పారు.
ఇవీ చదవండి: