ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదంలో గాయపడి ఆసుపత్రికి వెళ్లి.. ప్రాణం మీదకు తెచ్చుకున్న మహిళ - AP TOP NEWS TODAY

Govt Primary Health Medical Centre : ప్రమాదంలో ఎవరైన గాయపడితే.. వెంటనే ఆసుపత్రికి వెళ్ళి, ప్రాణాలను కాపాడుకుంటారు. కాని, రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ.. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రానికి వెళ్లి, ప్రాణాల మీదకు తెచ్చుకుంది. వెంటనే మేల్కొన్న బాధిత మహిళ భర్త.. ప్రైవేట్ కారులో వేరే ఆసుపత్రికి తీసుకెళ్లి, ఆమె ప్రాణాలను కాపాడుకున్నాడు.

phc
తిరుపతి

By

Published : Dec 17, 2022, 6:29 PM IST

Updated : Dec 17, 2022, 7:41 PM IST

Govt Primary Health Medical Centre : తిరుపతి జిల్లా డక్కిలిలో అనమ్మ అనే మహిళ ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. తలపై పెద్ద గాయాలు అయ్యాయి. దీంతో సదరు బాధిత మహిళను వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రానికి తీసుకెళ్లారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్ పరికరం పనిచేయడం లేదని వైద్యులు తెలిపారు. ఆక్సిజన్ లేకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. విద్యుత్ లేకపోవడంతోనే సమస్య వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు. ఉన్న జనరేటర్ కూడా పాడైపోయిందని తెలిపారు. దీంతో బాధిత మహిళను నెల్లూరు టౌన్ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు 108 వాహనం కూడా లేకపోవడంతో.. ప్రైవేట్ కారులో తీవ్రంగా గాయపడిన మహిళను తరలించడంతో, ఆమె బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితులను చూసిన స్థానికులు, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడానికి జంకుతున్నారనే ఆరోపణల వెల్లువెత్తుతున్నాయి.

ప్రమాదంలో గాయపడి ఆసుపత్రికి వెళ్లి.. ప్రాణం మీదకు తెచ్చుకున్న మహిళ
Last Updated : Dec 17, 2022, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details