ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేశ ఆహార ఉత్పత్తుల్లో.. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక పాత్ర: కేంద్రమంత్రి షెకావత్​

UNION MINISTER GAJENDRA SINGH: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​కు.. మంత్రి కాకాని గోవర్ధన్‍ రెడ్డి, వీసీ విష్ణువర్ధన్‍ రెడ్డి డాక్టరేట్‍ ప్రదానం చేశారు. దేశ ఆహార ఉత్పత్తుల్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించిందని షెకావత్ అన్నారు.

UNION MINISTER GAJENDRA SINGH
UNION MINISTER GAJENDRA SINGH

By

Published : Nov 16, 2022, 2:18 PM IST

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక పాత్ర

UNION MINISTER GAJENDRA SINGH : దేశ ఆహార ఉత్పత్తుల్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించిందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున ఆయనకు మంత్రి కాకాని గోవర్థన్​రెడ్డి, విశ్వవిద్యాలయ ఉపకులపతి విష్ణువర్ధన్​రెడ్డి డాక్టరేట్‍ ప్రదానం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍తో పాటు ప్రస్తుతం వ్యవసాయ విద్య, విస్తరణలపై విశ్వవిద్యాలయంఅనేక చర్యలు చేపట్టిందన్నారు. కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తూ ఎప్పటికప్పుడు పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. డాక్టరేట్‍ అందుకోవడం సంతోషంగా ఉందని షెకావత్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మిథున్​రెడ్డి, గురుమూర్తి, మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు.

వ్యవసాయ రంగానికి జగన్​ పెద్దపీట: పోలవరం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం లేదని.. మంత్రి కాకాని గోవర్దన్‌ రెడ్డి అన్నారు. వారిని ఒప్పించే విధంగా అడుగులు వేస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి పోలవరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీరు ఇచ్చేలా చర్యలు చేపడతామని మంత్రి కాకాని తెలిపారు. ఎవరెన్ని విమర్శలు చేసినా రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి జగన్​ పెద్దపీట వేశారన్నారు. పరిశోధనలు, రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చే విషయంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం మంచి పురోగతిని సాధించడం సంతోషకరమన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details