NFIR GENERAL SECRETARY AT TIRUMALA : ప్రపంచ స్థాయి ప్రమాణాలతో.. ప్రజలకు సేవ చేస్తూ భారత రైల్వేశాఖ నడుస్తోందని ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య తెలిపారు. రైల్వే శాఖను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 2021-22 సంవత్సరంలో రైల్వేశాఖ 1,418 మిలియన్ టన్నుల సరుకులను వివిధ రాష్ట్రాలకు రవాణా చేసి సేవలందించిందన్నారు. 17.18 శాతం ఆదాయాన్ని రైల్వేశాఖ పెంచుకుందని తెలిపారు.
'భారతీయ రైల్వే ప్రైవేటీకరణ నిర్ణయంపై పోరాడతాం' - తిరుమల తాజా వార్తలు
NFIR GENERAL SECRETARY IN TIRUMALA : భారతీయ రైల్వే ప్రైవేటీకరణ నిర్ణయంపై పోరాడతామని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య తెలిపారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
NFIR GENERAL SECRETARY AT TIRUMALA
అభివృద్ధి చెందుతున్న రైల్వేను ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని, మానిటైజేషన్, కార్పొరేషన్ పేరుతో ప్రైవేటు చేయాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విమర్శించారు. దీనిపై 13 లక్షల రైల్వే ఉద్యోగులను సమావేశపరిచి ప్రభుత్వ నిర్ణయంపై తమ వ్యతిరేకతను తెలుపుతామని స్పష్టం చేశారు. అలాగే ఈ ఉదయం ప్రారంభ విరామ దర్శన సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సలహాదారుడు రాజారాం పాండే, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ లు స్వామివారిని దర్శించుకున్నారు.
ఇవీ చదవండి: