AMARARAJA: తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని అమరరాజా సంస్థ త్వరలోనే ఆర్‌అండ్‌డీలో తమ నూతన ఆవిష్కరణలను వాణిజ్య తయారీ దిశగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోందని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, ఎంపీ గల్లా జయదేవ్ వెల్లడించారు. ఈ నెల 23 నుంచి 26 వరకు దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారని ఆ సంస్థ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. జయదేవ్ మాట్లాడుతూ... ‘మా గ్రూపు పలు నూతన ఎనర్జీ స్టార్టప్‌ల కోసం దేశంతోపాటు, విదేశాల్లోనూ పెట్టుబడులు పెట్టింది. దాదాపు ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులను రానున్న 5-10 సంవత్సరాల కాలంలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీ సామర్థ్యం మెరుగుపరిచేందుకు పెట్టనుంది. భారతదేశ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకోవడంలో మా సంస్థ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది...’ అని పేర్కొన్నారు.
AMARARAJA: అమరరాజాలో నూతన ఆవిష్కరణలు- ఎంపీ గల్లా జయదేవ్ - తిరుపతి జిల్లా తాజా వార్తలు
AMARARAJA: రేణిగుంట సమీపంలోని అమరరాజా సంస్థ త్వరలోనే ఆర్‌అండ్‌డీలో తమ నూతన ఆవిష్కరణలను వాణిజ్య తయారీ దిశగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోందని సంస్థ సహ వ్యవస్థాపకుడు, ఎంపీ గల్లా జయదేవ్ వెల్లడించారు.
అమరరాజాలో నూతన ఆవిష్కరణలు