Nara Lokesh Yuva Galam Pada Yatra: రాష్ట్రాన్ని జగన్ పూర్వ బిహార్‌లా మార్చేశాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. సూళ్లూరుపేట నియోజకవర్గం వజ్జావారిపాలెం విడిది కేంద్రం నుంచి 136వ రోజు యువగళం పాదయాత్రను ఆయన ప్రారంభించారు. పాదయాత్రకు ముందు లోకేశ్ పాస్టర్లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లు లోకేశ్‌కు తమ సమస్యలను వివరించారు. జగన్ గెలిచిన వెంటనే పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తామని మోసం చేశారని తెలిపారు. శ్మశాన స్థలాలు, కమ్యూనిటీ హాల్స్ లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. జగన్ పాలనలో చర్చిలు, పాస్టర్ల మీద దాడులు పెరిగిపోయాయన్నారు.
Lokesh Fire on Jagan: చర్చిలపైనా దాడులు.. జగన్‌కు డబ్బే మతం: లోకేశ్ - chandtrababu son Nara Lokesh
Yuva Galam Pada Yatra: తెలుగుదేశం అధికారంలోకి రాగానే పాస్టర్ల సమస్యలు పరిష్కరిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ భరోసానిచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో పాస్టర్లతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. క్రైస్తవులకు టీడీపీ అండగా నిలుస్తుందని.. అధికారం చేపట్టిన వెంటనే వారి కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు.
క్రిస్మస్ కానుక, పెళ్లి కానుక, జెరూసలేం యాత్ర: అనంతరంనారా లోకేశ్ పాస్టర్లుఅడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందరూ ఒక మతాన్ని నమ్ముకుంటారని.. మిగిలిన మతాలను గౌరవిస్తారని.. జగన్ కులాన్ని, మతాన్ని క్యాష్ చేసుకుంటాడని అని ఎద్దేవా చేశాడు. కులం, మతం, ప్రాంతం చూడకుండా చంద్రబాబు పాలనలో క్రిస్మస్ కానుక, పెళ్లి కానుక, జెరూసలేం యాత్రకు సహాయం అందించామని గుర్తు చేశారు. జగన్ చేతిలో పాస్టర్లు కూడా బాధితులేనని లోకేశ్ ఆరోపించాడు. ఇండిపెండెంట్ చర్చి పాస్టర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. చర్చిల నిర్మాణానికి సహాయం అందించడం లేదన్నారు. కరోనా సమయంలో పాస్టర్లను వైసీపీ ప్రభుత్వం ఆదుకొలేదన్నారు. పాస్టర్లు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తామని లోకేశ్ తెలిపారు. ప్రత్యేక క్రైస్తవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
జగన్ రెడ్డి జె-ట్యాక్స్ బెడద: విజనరీ పాలనకు, విధ్వంసకుడి అరాచకానికి నిలువుటద్దం ఫ్యాక్స్‌కాన్ అని నారా లోకేశ్ అన్నారు. ఈ బస్సులో చిరునవ్వులు చిందిస్తున్నది ఫ్యాక్స్‌కాన్ కంపెనీలో పనిచేస్తున్న నా చెల్లెళ్లని ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేసారు. గత ప్రభుత్వ హయాంలో తాను ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా చొరవ తీసుకుని ఫ్యాక్స్‌కాన్ ను శ్రీసిటీకి రప్పించానని గుర్తు చేశారు. ఆ సంస్థ 12,700 కోట్ల పెట్టుబడితో తమ యూనిట్‌ను ఏర్పాటు చేసి, 14వేలమంది మహిళలకు ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. ట్విస్ట్ ఏమిటంటే ఇదే కంపెనీ జగన్ రెడ్డి జె-ట్యాక్స్ బెడద తట్టుకోలేక లక్షమందికి ఉద్యోగాలు కల్పించే మరో యూనిట్ కు ఇటీవల తెలంగాణాలో భూమిపూజ చేసిందని మండిపడ్డారు. జగన్ ధనదాహానికి రాష్ట్ర ప్రజలు ఇంకా ఎంత మూల్యం చెల్లించుకోవాలని నారా లోకేశ్ ప్రశ్నించారు