Lokesh Comments On Minister Peddi Reddy : జగన్ జైలుకు వెళితే ముఖ్యమంత్రి కావాలని ఎదురుచూస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరుకు చేసిందేమి లేదని లోకేష్ అన్నారు. పుంగనూరు నియోజకవర్గం కొక్కువారిపల్లి విడిది కేంద్రం నుంచి 34వ రోజు యువగళం పాదయాత్ర లోకేశ్ ప్రారంభించారు. కల్లూరులో నిర్వహించిన హలో లోకేశ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిరుద్యోగులు, యువతతో ముఖాముఖి నిర్వహించారు. పుంగనూరులో పరిశ్రమలు రాకపొవడానికి కారణం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అని లోకేశ్ ఆరోపించారు. టీడీపీని గెలిపిస్తే పుంగనూరులో పరిశ్రమలను తీసుకవచ్చే భాద్యత తాను తీసుకుంటానని లోకేశ్ తెలిపారు. జగన్ రెడ్డి పాలనలో ఎక్కువగా నష్టపోయిన జిల్లా చిత్తూరు అని లోకేశ్ తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే క్రమ పద్దతిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు, ఓసీలలో ఉన్న పేదవారికి కార్పొరేషన్లు పునరుద్దరించి స్వయం ఉపాధి లభించేలా చేస్తామన్నారు. రాష్ట్రంలో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామన్నారు.
యువగళం పేరిట తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 4వేల కిలోమీటర్ల సుధీర్ఘ పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంభించారు. ప్రణాళిక ప్రకారమే జనవరి 27వ తేదిన పాదయాత్ర ప్రారంభమైంది. కాగా దీనికి పోలీసులు, ప్రభుత్వం అనేక అంక్షలు విధించినా.. అవి తేలిపోయాయి. పోలీసులు యువగళంపై అడిగిన వివరాలు గొంతెమ్మ కోరికల లాగా ఉన్నాయని టీడీపీ నేతలు అన్నారు