Lokesh's 19th Day Padayatra: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 19వ రోజు పాదయాత్రకు విశేశ స్పందన లభిస్తుంది. పాదయాత్రలో భాగంగా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని నారాయణవనం, పిచ్చాటూరు మండలాల్లో పర్యటించారు. నారాయణవనం మండలం రాళ్ళ కాల్వ, గోవిందప్ప నాయుడు కండ్రిగ, కైలాసకోన రహదారి, అరణ్యం కండ్రిగ, కృష్ణంరాజు కండ్రిగ, ఐఆర్ కండ్రికల మీదుగా పాదయాత్ర సాగింది.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్:తుంబూరు ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు పాదయాత్రలో వెళ్తున్న లోకేశ్ ను కలిసి తమ సమస్యలు వివరించారు. ఎస్సీ కాలనీల్లో దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రాయితీని తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యుత్ ఇచ్చి ఆదుకోవాలన్న విజ్ఞప్తికి లోకేశ్ స్పందించారు. 200 యూనిట్ల వరకు ఎలాంటి షరతులు లేకుండా ఎస్సీ కాలనీలకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. వెదురు కళాకారులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. గోవిందప్ప కండ్రిగలో స్థానికులతో మాటామంతీలో లోకేశ్ పాల్రొన్నారు. అరణ్యం కండ్రిగలో దాసరి, పద్మశాలి సామాజికవర్గీయులతో సమావేశమైన లోకేశ్ వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. పలమనగళంలో ముస్లిం మైనారిటీలతో మాట్లాడారు.