ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Suicide: తల్లీ, కుమారుడు ఆత్మహత్య.. కారణం అదేనా..? - తల్లీ కుమారుడు ఆత్మహత్య

Suicide: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో.. తల్లీ, బిడ్డ ఆత్మహత్యకు పాల్పడటంతో విషాదం నెలకొంది. భార్యాభర్తల మధ్య రెండేళ్లుగా వివాదం నడుస్తుండటంతో.. బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

mother and son suicide in srikalahasti in tirupathi
తల్లీ, కుమారుడు ఆత్మహత్య

By

Published : May 29, 2022, 10:01 AM IST

Suicide: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో విషాదం నెలకొంది. జేకే టవర్స్​లో నివాసముంటున్న కల్యాణి(26), తన బిడ్డతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. కల్యాణికి చెన్నైలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మునిశేఖర్​తో ఆరేళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమారుడు ముని మేధన్ష్(5) ఉన్నాడు. అయితే భార్యాభర్తల మధ్య రెండేళ్లుగా వివాదం నడుస్తుండటంతో.. కల్యాణి శ్రీకాళహస్తిలో తన పుట్టింట్లో ఉంటుంది. శనివారం బిడ్డకు నిద్రమాత్రలు మింగించి.. తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details