MINISTER ROJA: నగరి పవర్ లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని.. మంత్రి రోజా కోరారు. ఈ మేరకు తిరుపతిలో చేనేత కార్మికులతో కలిసి పెద్దిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ తప్పిదం వల్ల పవర్ లూమ్ కార్మికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్ధితి వచ్చిందని రోజా అన్నారు. స్పందించిన పెద్దిరెడ్డి.. పవర్‌లూమ్ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్‌తో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన రోజా.. ఎందుకంటే?
MINISTER ROJA: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని.. పర్యాటక శాఖ మంత్రి రోజా తిరుపతిలో కలిశారు. నగరిలో మరమగ్గాల కార్మికుల సమస్యలను పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లిన రోజా.. విద్యుత్ బిల్లులు తగ్గించాలని కోరారు.
MINISTER ROJA
హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై మంత్రి రోజా స్పందించారు. సీఎం జగన్ విచారణకు ఆదేశించారని తెలిపారు. వీడియో నిజమా? కాదా? అని తెలుసుకోకుండా తెదేపా నేతల విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే జగన్ వదిలిపెట్టరని.. తీవ్రమైన చర్యలు తీసుకుంటారని అన్నారు.
ఇవీ చదవండి: