Minister Roja Dance: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలు భవిష్యత్తు తరాలకు తేలియజేసేందుకు జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు చేస్తున్నామని మంత్రి రోజా అన్నారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు రెండవ రోజు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు. సాంస్కృతిక సంబరాలలో గెలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని బలం భారతదేశానికి ఉందన్నారు. దేశం అభివృద్ధి వైపు నడవాలన్నా, మన సంస్కృతి భావితరాలు ఆచరించాలన్నా యువత చేతిలోనే ఉందని ఆమె తెలిపారు.
జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు.. స్టెప్పులేసిన మంత్రి రోజా - పిల్లలతో కలిసి మంత్రి రోజా డ్యాన్స్
Jagananna Swarnotsava Samskruthika Sambaralu: దేశ సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలను భవిష్యత్తు తరాలకు చేరువ చేసేందుకే జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు చేస్తున్నామని మంత్రి రోజా అన్నారు. తిరుపతిలో జరుగుతున్న రెండవ రోజు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె.. విద్యార్థులతో కలిసి నృత్య ప్రదర్శన చేశారు. ఉత్తమ ప్రతిభావంతులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
Minister Roja