Minister Peddiereddy Ramachandra Reddy: వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు సవరించిన అంచనాల మేరకు ఆరు వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తున్నామని.. టెండర్ల ప్రక్రియ జ్యుడీషియల్ సమీక్ష స్థాయిలో ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయటం ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. నాణ్యమైన విద్యుత్ పొందడం రైతులకు హక్కన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా 18 వేల వ్యవసాయ మోటార్లకు ఏర్పాటు చేసిన మీటర్ల ద్వారా మూడో వంతు విద్యుత్ పొదుపు చేయగలిగామన్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు మీటర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
మార్చిలోపు వ్యవసాయ మోటార్లకు మీటర్లు: మంత్రి పెద్దిరెడ్డి - Srikakulam
Minister Peddiereddy Ramachandra Reddy: రాబోయే సంవత్సరం మార్చి వరకు వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటును పూర్తి చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. విద్యుత్ మోటర్ల ద్వారా రైతులకు లబ్ది చేకూరుతుందని అన్నారు. విద్యుత్ మీటర్ల ఏర్పాటు పక్రియకు టెండర్లు పిలవనున్నట్లు మంత్రి తెలిపారు.
![మార్చిలోపు వ్యవసాయ మోటార్లకు మీటర్లు: మంత్రి పెద్దిరెడ్డి Peddiereddy Ramachandra Reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16742951-272-16742951-1666705451478.jpg)
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి