Peddireddy Ramachandra Reddy వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని స్థానాల్లో వైకాపాను ప్రజలు గెలిపిస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు కుప్పంలో ఓడిపోవడం ఖాయమని జోష్యం చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు కుప్పంలో ఏడు వేల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. చంద్రబాబు కుప్పంను అభివృద్ధి చేసి ఉంటే ఇళ్ల కోసం ప్రజలు ఎందుకు దరఖాస్తు చేసుకుంటారని ప్రశ్నించారు. ప్రజల మన్నలను పొంది గెలవాలే కానీ రెచ్చ గొట్టి కాదన్నారు. తమ కార్యకర్తలను తెదేపా వర్గంవారు కొట్టినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. పదే పదే దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రెచ్చగొట్టే ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు మానసిక స్థితి బాగాలేదని... మంచి వైద్యం చేయించాలని పెద్దిరెడ్డి సూచించారు.
Minister Peddireddy కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయమన్న మంత్రి పెద్దిరెడ్డి - ఏపీ తాజా వార్తలు
Peddireddy Ramachandra Reddy కుప్పంలో చంద్రబాబే వైకాపాను రెచ్చగొట్టారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైకాపా కార్యకర్తలపై తెదేపా శ్రేణులే దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుప్పంలో గెలవలేరన్నారు.
![Minister Peddireddy కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయమన్న మంత్రి పెద్దిరెడ్డి Peddireddy Ramachandra Reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16212541-558-16212541-1661590507650.jpg)
మంత్రి పెద్దిరెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి
"కుప్పంలో చంద్రబాబే వైకాపాను రెచ్చగొట్టారు. మా కార్యకర్తలను తెదేపా వర్గంవారు కొట్టినా పోలీసులు పట్టించుకోలేదు. తెదేపావారే గలాట చేశారు. చంద్రబాబు సెక్యూరిటీ కోసం గలాట చేసినట్లు అనిపించింది. 20-25 మంది నాయకులను పెట్టుకుని కుప్పంలో రాజకీయాలు చేయాలంటే చెల్లదు. ప్రజలు మావైపు ఉన్నారు. వారిని బలవంతంగా తమవైపు తిప్పుకోవాలని చూస్తే మేము ఇక్కడేమీ ఊరికే కూర్చోలేదు. కుప్పంలో కెనాల్ పూర్తి చేసే ఎన్నికలకు వెళతాం." -మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఇవీ చదవండి: