ఉమ్మడి చిత్తూరులో మిగ్‌జాం ఉధృతి - పొంగుతున్న వాగులు, వంకలు Michaung cyclone in titupati :తుపాను ప్రభావం తిరుపతి జిల్లాలో తీవ్రంగా ఉంది. నగరంలో చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ప్రధాన ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాత్రి నుంచి కురుస్తున్న వానలకు వస్తున్న నీటితో కాలనీలు జలదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. రాత్రి నుంచి జాగారం చేస్తున్నామని... ఎన్నిసార్లు ఫోన్‌చేసినా అధికారుల నుంచి కనీస స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి తలెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మిగ్‌జాం బీభత్సం- భారీ వర్షాలకు 8 మంది మృతి, స్కూళ్లు బంద్
Michaung cyclone affected districts in AP :ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వర్షాల తీవ్రత కొంతమేర తగ్గినా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. తిరుపతి జిల్లాలోని సూళ్ళూరుపేట, గూడూరు, శ్రీకాళహస్తి, వెంకటగిరి నియోజకవర్గాలలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. శ్రీకాళహస్తిలో వరద ప్రభావంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పానగల్ విద్యుత్ ఉపకేంద్రం ఆవరణంలోకి పెద్ద ఎత్తున వరద చేరింది.
'తుపాను ప్రభావం' ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షం - అవస్థలు పడుతున్న రైతన్నలు
Michaung cyclone affected districts : కాళంగి, స్వర్ణముఖి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్ధలకు సెలవు ఇచ్చారు. గూడూరు- రాజంపేట ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గూడూరు ప్రాంతంలో తుపాన్ కారణంగా భారీ ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. మరో వైపు విద్యుత్ స్తంబాలు పడిపోయాయి. ప్రజలంతా అంధకారంలో ఉండిపోయారు. తాగునీరు లేక అవస్థలుపడుతున్నారు. గూడూరు ప్రాంతంలో కైవల్య నది, పంబలేరు, చల్లకాలువ, కండలేరు యేరు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.
ఉప్పొంగిన గోగర్భం, పాపవినాశనం - గేట్లెత్తిన అధికారులు
cyclone affected districts in AP :మిగ్‌జాం తుపాను ప్రభావం వల్ల ఇప్పటికే తిరుమలలో వానలు జోరందుకున్నాయి. సోమవారం ఒక్క రోజే పాతం కొండపై 100 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను వానల కారణంగా ఆంధ్రాలోని జలాశయాలన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. కొన్ని ప్రదేశాల్లో నీటి ఎద్దడి అధికమవడంతో చేసేదేంలేక అధికారులు గేట్లు ఎత్తుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వాగులు, వంకలు నిండి ఊర్లలోకి నీరు చేరడం విధితమే.
తిరుపతిలో నీట మునిగిన ప్రాంతాలు - వాగులో చిక్కుకున్న యువకులను కాపాడిన అధికారులు