Michaung cyclone in tirupati srikalahasti : ఏర్పేడు మండలం బండారుపల్లిలో వాగులో చిక్కుకున్న యువకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం అతలాకుతలంగా మారింది. పెద్ద ఎత్తున వరద నీరు ఏర్పేడు లోకి చేరడంతో మోకాల్లోతు నీటిలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బండారుపల్లికి చెందిన శివ, వెంకటేష్ సోమవారం వ్యవసాయ పనుల కోసం పొలాల వద్దకు వెళ్లి సున్నపు వాగులో చిక్కుకున్నారు. ఈ రోజు ఉదయం శ్రీకాళహస్తి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని యువకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. జంగాలపల్లి కలజు తెగిపోవడంతో చెరువు నీరంతా వృధాగా బయటకు వెళ్లాయి. శ్రీకాళహస్తి, పాపారాయుడుపేట, గుడిమల్లం, పిచ్చాటూరు, వెంకటగిరి రహదారులపై వరద ప్రవాహం పెరిగిపోవడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. వరద ప్రభావంతో శ్రీకాళహస్తిలో ప్రజలు తీవ్ర అవస్థలు. ఎదుర్కొంటున్నారు.
మిగ్‌జాం బీభత్సం- భారీ వర్షాలకు 8 మంది మృతి, స్కూళ్లు బంద్
విస్తరించిన మిచౌంగ్ తుపాన్ - ఉప్పొంగిన తిరుపతి జిల్లా స్వర్ణముఖి నది
Michaung cyclone in tirupati 2023 : తుపాను ప్రభావం తిరుపతి జిల్లాలో తీవ్రంగా ఉంది. నగరంలో చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ప్రధాన ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాత్రి నుంచి కురుస్తున్న వానలకు వస్తున్న నీటితో కాలనీలు జలదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. రాత్రి నుంచి జాగారం చేస్తున్నామని ఎన్నిసార్లు ఫోన్‌చేసినా అధికారుల నుంచి కనీస స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి తలెత్తుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.