Tirupati Abhaya Kshetra Centre Anarchy: వైయస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం రాజీవ్ నగర్ కాలనీకి చెందిన వేణు గోపాల్ అనే విద్యార్థి తిరుపతిలోని అభయ క్షేత్ర మానసిక వికలాంగుల కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నాడు. అక్కడి సిబ్బంది వేణుగోపాల్‌ని దారుణంగా చితకబాదిన ఘటన సంచలనం రేపింది. ఈ నెల 23న దీపావళి పండుగ కోసం కుమారుడిని ఇంటికి తీసుకువచ్చేందుకు తల్లి తిరుపతి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా తన కుమారుడి ఒంటిపై గాయాలను గమనించారు. గాయాలు ఎక్కువగా ఉండడంతో మంగళవారం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్య సిబ్బంది దెబ్బలు ఎలా తగిలాయని ఆరా తీయగా.. విషయం వెలుగులోకి వచ్చింది. వేణుగోపాల్‌ను దారుణంగా కొట్టడంతో బాధిత విద్యార్థి తల్లి కన్నీరుమున్నీరయ్యారు.
తిరుపతిలో దారుణం.. మానసిక విద్యార్థిని చితకబాదిన యాజమాన్యం - తిరుపతిలో మానసిక విద్యాలయం
తిరుపతిలో దారుణం జరిగింది. ఓ మానసిక విద్యాలయంలో జమ్మలమడుగు మండలానికి చెందిన విద్యార్థిని దారుణంగా చితకబాదిన సంఘటన చోటుచేసుకుంది. గాయాల పాలైన విద్యార్థిని చికిత్స నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. జమ్మలమడుగు మండలం రాజీవ్ నగర్ కాలనీకి చెందిన వేణు గోపాల్ తిరుపతిలోని ఓ మానసిక విద్యాలయంలో చదువుతున్నాడు. దీపావళి కోసం కొడుకును ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్లిన తల్లి.. తిరుగు ప్రయాణంలో అతడి ఒంటిపై గాయాలను గమనించింది. గాయలు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చింది. మానసిక విద్యాలయం ఉద్యోగులు తనను వైర్‌తో కొట్టినట్లు కుమారుడు చెప్పాడని తల్లి చెబుతున్నారు.
విద్యార్థిని చితకబాదిన యాజమాన్యం
నా కుమారుడు మానసికంగా వికలాంగుడు. అందుకోసం అభయ క్షేత్ర మానసిక వికలాంగుల కేంద్రంలో సుమారు పదేళ్ల కిందట తర్ఫీదు ఇచ్చేందుకు చేర్పించాం..తన దగ్గరికి అప్పుడప్పుడు వెళ్లి వస్తుంటాను. పండుగ సందర్భంగా ఇంటికి తీసుకు వచ్చే క్రమంలో గాయాలు ఎలా తగిలాయని కుమారుడిని అడిగాను.. ఉద్యోగులు తనను వైర్ తీసుకొని దారుణంగా కొట్టినట్లు చెప్పాడు. గాయాలు మానకపోవడంతో జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చాను.''- లక్ష్మిదేవమ్మ,బాధితుడి తల్లి
ఇవీ చదవండి:
Last Updated : Oct 25, 2022, 7:10 PM IST