Man dies of heart attack in RTC bus: తిరుపతి జిల్లా చంద్రగిరిలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా మహ్మహద్ రఫీ అనే ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందాడు. పులిచర్ల మండలం కల్లూరుకు చెందిన మహ్మహద్ రఫీ గతకొంత కాలంగా గుండెనొప్పితో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈరోజు భార్య గులాబ్ జాన్‌తో కలిసి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుని తిరిగి వెళ్తుండగా.. చంద్రగిరి సమీపంలో గుండెపోటు వచ్చి స్పృహ తప్పి పడిపోయినట్లు తెలిపారు. తోటి ప్రయాణికులు వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహమ్మద్ రఫీని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించినట్లు మృతుడి భార్య వెల్లడించింది.
ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడికి గుండెనొప్పి.. ఆసుపత్రికి తరలించే లోపే..! - Man died heart attack
Man died heart attack: బస్సులో వెళుతుండగా గుండెపోటు రావడంతో మహ్మహద్ రఫీ అనే ప్రయాణికుడు మృతి చెందాడు. తిరుపతి జిల్లా పులిచర్ల మండలం కల్లూరుకు చెందిన మహ్మహద్ రఫీ గతకొంత కాలంగా గుండెనొప్పితో బాధపడుతున్నట్లు అతని భార్య తెలిపింది.
Man died heart attack