Chiluka Vaahana Seva: చంద్రప్రభల నుంచి వెన్నెల కాంతులు విరజిమ్మే పుష్పాలంకరణలతో ఆదిదంపతులు భక్త కోటికి దర్శనం ఇచ్చారు. మహా శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం సూర్యప్రభపై వచ్చిన స్వామి.. రాత్రి భూతనాథుడిపై శ్వేత వర్ణ పుష్ప అలంకరణలతో, విశేష దివ్యాభరణాలతో సర్వాంగ సుందరంగా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వెంబడి జ్ఞానాంబిక అదే రీతిలో భక్తుల మొర ఆలకిస్తూ కల్పవల్లిగా దర్శనమిచ్చారు. ముందు శివపరివారమైన వినాయకస్వామి, శ్రీవల్లీ, దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యుడు, చండికేశ్వరునితో కలిసి ఉత్సవమూర్తుల ఊరేగింపుతో భక్తులు పులకించారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వైభవంగా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు..
Chiluka Vaahana Seva: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భూత, చిలుక వాహన సేవ, సూర్య ప్రభ వాహనంపై భక్తులకు ఆది దంపతులు దర్శనం ఇచ్చారు.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవం: తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భూత రాత్రిని పుష్కరించని సోమ స్కంద మూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి భూత, చిలుక వాహనాలను అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఆది దంపతులను దర్శించుకున్నారు. ఉత్సవర్లు ముందు భక్తుల భజనలు, కోలాటాలతో భూత గణాలకు అధిపతి అయిన స్వామి అమ్మవార్లకు స్వాగతం పలికారు. కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ దర్శించుకోవడంతో శివ నామ స్మరణలతో శ్రీకాళహస్తి మారుమోగింది.
సూర్య ప్రభ వాహనంపై భక్తులకు ఆది దంపతులు దర్శనం: శ్రీ కాళహస్తిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్య ప్రభ వాహనంపై భక్తులకు ఆది దంపతులు దర్శనం ఇచ్చారు. భూత గణాలకు అధిపతి అయిన సర్వాంతర్యామి సూర్య ప్రభ, చప్పరం వాహనాలపై సోమ స్కంద మూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణా భరణాల అలంకరణలో కొలువదీరిన ఆది దంపతులు మాడవీధుల్లో ఊరేగారు. ఉత్సవర్లు ముందు భక్తుల కోలాటాలు, భజనలతో ఆది దంపతులకు స్వాగతం పలికారు. కర్పూర నిరాజనాలతో స్వామీ, అమ్మవార్లు ను దర్శించుకున్నారు. రాత్రికి భూత , శుక వాహన సేవ జరగనున్నది.
ఇవీ చదవండి