Lorry and Bike burnt in a road accident: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని భాకరాపేట కనుమలో తిరుపతి-మదనపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ, ద్విచక్ర వాహనం దగ్ధమయ్యాయి. ఓ లారీ కదిరి నుంచి నెల్లూరుకి మొక్కజొన్న పొట్టుతో వెళ్తుంది. భాకరాపేట కనుమ దారిలో దయ్యాలకోన వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. అనతంరం కొంతదూరం బైకును లాక్కెళ్లింది. ఈ క్రమంలో చెలరేగిన మంటల్లో రెండు వాహనాలు కాలిపోయాయి. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.
భాకరాపేట కనుమలో రోడ్డు ప్రమాదం.. లారీ, ద్విచక్రవాహనం దగ్ధం - lorry burnt at bhakarapeta pass
Accident in Bhakarapeta Pass in Tirupati: తిరుపతి-మదనపల్లి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ, బైకు కాలి బూడిదయ్యాయి.
lorry and bikes burnt in a road accident
సమాచారం తెలుసుకున్న రంగంపేట గ్రామస్థులు, చంద్రగిరి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. గాయపడ్డ యువకుడిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. తిరుపతి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన పోలీసులు.. కనుమదారిలో రాకపోకలను పర్యవేక్షించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పారిపోవడంతో పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
Last Updated : Jun 23, 2022, 10:18 PM IST