LEOPARD: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఆవరణలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. వందలాది ఎకరాల సువిశాలమైన విశ్వవిద్యాలయ ప్రాంగణంలో.. గత మూడు నెలలుగా చిరుత సంచరిస్తున్నట్లు.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో ఇటీవల కుక్కల సంఖ్య తగ్గిపోతూ ఉండటంతో.. అధికారులు సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించగా.. చిరుత సంచారం బయటపడింది. కుక్కలను వేటాడేందుకు ప్రయత్నించే దృశ్యాలు కనిపించాయి. చిరుత సంచారంతో విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను విశ్వవిద్యాలయ ప్రాంగణం నుంచి దాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
VIDEO VIRAL తిరుపతిలో చిరుత కలకలం, వీడియో వైరల్ - leopard
LEOPARD AT SV UNIVERSITY శ్రీ వెంకటేశ్వర పశువైద్య వర్సిటీలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. యూనివర్సిటీ పరిపాలనా భవన ఆవరణలో చిరుత సంచరించడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. భవన ఆవరణలో తిరుగుతున్న కుక్కలను చంపేందుకు చిరుత ప్రయత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
LEOPARD AT SV UNIVERSITY