తితిదే ఈవోగా ధర్మారెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించడంపై జనసేన విమర్శించింది. ధర్మారెడ్డి పదవి సమయం పూర్తయినా ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారన్నారని ఆ పార్టీ నేతలు పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ ప్రశ్నించారు. ఐడీఈఎస్ చదవుకున్న వ్యక్తిని తితిదే ఈవోగా, ఎస్వీబీసీ ఎండీగా, సంస్కృత విద్యాపీఠం వైస్ ఛాన్సలర్‌గా నియమించడం ఏమిటని నిలదీశారు. రాష్ట్రంలో చాలా మంది ఐఏఎస్ అధికారులున్నా.. జగన్ ధర్మారెడ్డికి ఇన్నిపదవులు కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటని జనసేన నేతలు ప్రశ్నిoచారు. ఈ నెల 14న ధర్మారెడ్డి పదవీకాలం పూర్తయ్యాక ఆయనను తన మాతృసంస్థకు తిరిగి పంపేలా ప్రభత్వం చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో తితిదే ఉద్యోగులతోపాటు ఇతర పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని జనసేన నేతలు హెచ్చరించారు.
ఆయనకు ఇన్ని పదవులు కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? : జనసేన
తితిదే ఈవోగా ధర్మారెడ్డిని నియమించడంపై జనసేన ఆగ్రహం వ్యక్తంచేసింది. పదవీ సమయం పూర్తవుతున్నా.. కొనసాగించడంపై విమర్శలు గుప్పించారు. అన్ని పదవులూ ఒక్కరికే అప్పగించటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆయనకు ఇన్ని పదవులు కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి?