ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోజా ఇంటి ముందు జనసేన నేతల నినాదాలు.. ఎందుకంటే...? - రోజా ఇంటి ముందు తొడగొట్టిన జనసేన లీడర్

Janasena Leader: జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్​ను నగరి పోలీసులు రాత్రి అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కానీ కిరణ్ రాయల్​కు 41A కింద నోటీసులు ఇవ్వాలన్న న్యాయస్థానం.. బెయిల్ మంజూరు చేసింది. కిరణ్ బెయిల్​పై విడుదలైన తర్వాత జనసేన నేతలు నగరిలో ర్యాలీ నిర్వహించారు. మంత్రి రోజా ఇంటి ముందుకు రాగానే తొడగొట్టి పెద్దఎత్తున నినాదాలు చేశారు.

Leader Kiran Royal
కిరణ్ రాయల్

By

Published : Nov 12, 2022, 7:03 PM IST

రోజా ఇంటి ముందు తొడగొట్టిన జనసేన నేతలు

Janasena Leader Kiran Royal: జనసేన పార్టీ పై మంత్రి రోజా వ్యాఖ్యలను తిప్పికొట్టిన తిరుపతికి చెందిన ఆ పార్టీ నాయకుడు కిరణ్ రాయల్​కు బెయిల్ మంజూరైంది. కిరణ్‌రాయల్‌ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైకాపా మహిళా కార్యకర్తలు అక్టోబర్‌ 18న నగరి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నగరి పోలీసులు కిరణ్‌రాయల్‌ను శుక్రవారం రాత్రి తిరుపతిలో అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం నగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కిరణ్ రాయల్​కు 41A కింద నోటీసులు ఇవ్వాలన్న న్యాయస్థానం రూ.10 వేల సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. కిరణ్ రాయల్ బెయిల్ పై విడుదలైన తర్వాత నగరిలో ర్యాలీ చేసిన జనసేన నేతలు.. మంత్రి రోజా ఇంటి ముందుకు రాగానే తొడగొట్టి పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details