Jansena warning: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి వాహనం ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి తెచ్చాడని.. సీఎం మెప్పు పొందేెందుకు మంత్రులు విమర్శించడం సరికాదని జనసేన నాయకులు అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2024లో మంత్రి రోజాకు నగిరిలో ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. మంత్రి రోజా గెలిస్తే తన ఇంటి ముందే గుండు గీయించుకోవడానికి సిద్ధమని తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ ప్రకటించారు. రోజా విఫలమైనా, వైసీపీ ప్రభుత్వం రాకపోయినా గుండు కొట్టుకోవడానికి సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు.
2024లో రోజా గెలిస్తే.. గుండు గీయించుకుంటా: కిరణ్ రాయల్ - JanaSena leader Kiran Royal challenge to Roja
Jansena warning: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి వాహనంతో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడానికి సిద్ధమయ్యాడు. దీనిపై వైసీపీ మంత్రులు సీఎం మెప్పు పొందడం కోసం విమర్శించడం సరికాదని జనసేన నాయకులు అన్నారు. 2024లో మంత్రి రోజాకు నగిరిలో ఓటమి ఖాయమని స్పష్టం చేశారు.
కిరణ్ రాయల్
తమ అధినేతపై మంత్రి అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డిలు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. మంత్రి అంబటిపై సామాజిక మాద్యమాలలో వస్తున్న ఆరోపణలు వాస్తవమని.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: