ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pawan Srikalahasti Tour: సోమవారం తిరుపతికి పవన్​ కల్యాణ్​.. ఆ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు

Janasena Chief Pawan Kalyan Srikalahasti Tour: ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రను పూర్తి చేసుకున్న జనసేన అధినేత పవన్​.. సోమవారం నాడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు సాయిపై చేయి చేసుకున్న సీఐ అంజూ యాదవ్‌పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు.

Pawan Srikalahasti Tour
Pawan Srikalahasti Tour

By

Published : Jul 15, 2023, 4:36 PM IST

Janasena Chief Pawan Kalyan Srikalahasti Tour: సోమవారం తిరుపతిలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటించనున్నారు. శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు సాయిపై చేయి చేసుకున్న సీఐ అంజూ యాదవ్‌పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. సీఐపై చర్యలు తీసుకోవాలని పవన్‌ డిమాండ్ చేయనున్నారు. ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల ఆందోళనలో సాయిపై సీఐ అంజూ యాదవ్‌ చేయిచేసుకున్నారు.

ఇదీ జరిగింది:జనసేన అధినేత పవన్​ కల్యాణ్​పై ముఖ్యమంత్రి జగన్​ వ్యాఖ్యలను నిరసిస్తూ.. జులై 12న తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆ పార్టీ నేతలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో సీఎంపై వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న జనసైనికులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్​.. జనసేన నాయకుడు సాయిపై చేయిచేసుకున్నారు. రెండు చెంపలు వాయిస్తూ రెచ్చిపోయారు. దీంతో ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై జనసేన కార్యకర్తలు కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంపై తీవ్రంగాస్పందించిన పవన్​.. సోమవారం తిరుపతి వెళ్లి జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయనున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో ముగిసిన వారాహి యాత్ర: రాష్ట్రంలో వైసీపీ పాలనను గద్దె దింపడమే లక్ష్యంగా జూన్​ 14న అన్నవరం సత్యదేవుని సన్నిధి నుంచి ప్రారంభమైన వారాహి యాత్ర రెండు దశలను పూర్తి చేసుకుంది. జూన్​ 14 నుంచి జూన్​ 30 వరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో.. జులై 9 నుంచి జులై 14వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రను పవన్​ పూర్తి చేసుకున్నారు. ఈ వారాహి యాత్రలో వైఎస్సార్​ కాంగ్రెస్​ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. వాలంటీర్​ వ్యవస్థపై పవన్​ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. మానవ అక్రమ రవాణా జరగడానికి కారణం వాలంటీర్​ వ్యవస్థే అని పవన్​ చేసిన వ్యాఖ్యలతో వాలంటీర్లు పెద్దఎత్తున ఆందోళనలు కూడా చేశారు. రాష్ట్రంలో 30వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని తనకి నిఘా వర్గాలు చెప్పినట్లు తెలిపారు. దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్​ కూడా నోటీసులు ఇచ్చింది.

Varla Ramaiah Letter to DGP on CI Anju Yadav: శ్రీకాళహస్తి టౌన్ సీఐ అంజూయాదవ్​పై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి​ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. అంజూయాదవ్ లాంటి పోలీసుల దురుసు ప్రవర్తనతో రాష్ట్రంలో పోలీసుల ప్రతిష్ఠ రోజురోజుకు దిగజారుతోందని మండిపడ్డారు. అధికారపార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్న సీఐ అంజూయాదవ్​పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details