Jallikattu In Tirupathi District: సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలో ఈరోజు ఏర్పాటు చేసిన ఎడ్ల పందాలు ఉర్రూతలు ఊగించాయి. ప్రజలు తమ పశువులను అలంకరించి పోటీలకు తీసుకువచ్చారు. పోటీ నిర్వాహకులు ఎడ్లకు పలకలు, వస్త్రాలు కట్టి విడతల వారీగా వీటిని పందానికి బరిలోకి వదిలారు. ఈ పందాాలను తిలకించేందుకు అధిక సంఖ్యలో గ్రామాల్లోకి చేరుకున్న యువతతో స్థానికంగా కోలాహలం నెలకొంది. వేగంగా పరుగులు తీస్తున్న పశువులను నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు.
BULL FEST: పశువుల పండుగకు ముస్తాబైన చంద్రగిరి నియోజకవర్గం
Bull Festival celebrations in Rangampeta: దశాబ్ధాల నుంచి ఆనవాయితీగా సాగుతున్న ఈ పశువుల పండగను తిరుపతి జిల్లా వాసులు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పర్వదినాల చివరి రోజయిన కనుమ పండగ రోజు పశువులను అందంగా అలంకరించి, కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేసిన చెక్కపలకలు కట్టి వీధుల్లో వదిలారు. పశువులకు కట్టిన పలకలను దక్కించుకొనేందుకు యువకులు పోటీపడటం, పశువులు బెదిరి పారిపోవడం వంటి వాటితో పోటీలు ఆసక్తికరంగా సాగాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించటానికి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. వృత్తి, ఉద్యోగాల రిత్యా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిన వారు సంక్రాంతి పండుగకు కచ్చితంగా రంగంపేటకు చేరుకుని జల్లికట్టు పోటీలను వీక్షిస్తారని స్థానికులు చెబుతున్నారు. వీధి పొడవునా ప్రజలు బారులు తీరి జల్లికట్టు పోటీలను తిలకించారు. భవనాల పైకి చేరి కేరింతలు కొడుతూ ఆసక్తిగా వీక్షించారు. జల్లికట్టు పోటీలు ప్రత్యక్షంగా చూడటం మెుదటిసారి అని, మంచి అనుభూతి కలిగించిందని ఇక్కడికి వచ్చిన యువత తెలిపారు.