ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా టీకా తయారీలో ప్రపంచంలోనే భారత్ 5వ స్థానం: సుచిత్ర ఎల్ల - తిరుపతి జిల్లా వార్తలు

India Rank 5th in manufacturing Corona vaccine in the world: కరోనా టీకా తయారీలో ప్రపంచంలోనే భారత్ 5వ స్థానంలో నిలిచిందని భారత్ బయోటెక్ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్ల అన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో 'మన డాక్టర్​ మస్తాన్'​ చారిటబుల్​ ట్రస్టును ఆమె ప్రారంభించారు.

భారత్
India

By

Published : Dec 7, 2022, 7:39 PM IST

Suchitra Ella: తిరుపతి జిల్లా వెంకటగిరిలో 'మన డాక్టర్ మస్తాన్' చారిటబుల్ ట్రస్టును భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల ప్రారంభించారు. స్థానిక నాచురోపథి వైద్యుడు మస్తానయ్య స్థాపించిన ఈ ట్రస్ట్ ప్రారంభానికి వచ్చిన సుచిత్ర ఎల్లకు ఘన స్వాగతం పలికారు. కరోనా టీకా తయారీలో ప్రపంచంలోనే భారత్ 5వ స్థానంలో ఉందని సుచిత్ర ఎల్ల అన్నారు. దేశంలో 3డోసులకు కలిపి.. 3 బిలియన్ల టీకాలు తయారు చేయడం జరిగిందని అన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రసంగిస్తూ భారత్ బయోటెక్ సంస్థ వలన మన దేశం కరోనా నుంచి బతికి బయట పడగలిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ హాజరయ్యారు.

కరోనా టీకా తయారీలో ప్రపంచంలోనే భారత్ "5వ" స్థానం

కరోనా టీకా తయారు చేసిన దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో ఉంది. శాస్త్రవేత్తలు, సిబ్బంది, ప్రభుత్వ సమష్టి కృషితో ఇది సాధ్యమైంది. అందులో భారత్ బయోటెక్ భాగస్వామి కావడం సంతోషకరం. -సుచిత్ర ఎల్ల, భారత్​ బయోటెక్​ ఎండీ

ఇవి చదవండి

ABOUT THE AUTHOR

...view details