Impact of Cyclone Michaung on Tirupati District : తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలోని తడసూళ్లూరుపేట, దొరవారిసత్రం, నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల్లో నాలుగు రోజుల నుంచి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. ఇక వరి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. నెలరోజుల క్రితమే జిలకర, ఇతర రకాల పంటలు వేశారు. ఎకరాకు రూ.15 నుంచి రూ.25 వేలు ఖర్చు చేశారు.
భారీగా వర్షాలు, రైలు పట్టాలపై నీరు-మిగ్‌జాం తుపానుతో స్తంభించిన రవాణా వ్యవస్థ!
Heavy Rains in Tirupati District : తుపానుతో వరిపొలాలలో మూడు నాలుగు అడుగుల లోతుగా వరద నీరు పారుతుంది. నాయుడుపేట పుదూరు, పెళ్లకూరు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో వరి పంట వేలాది ఎకరాల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. స్వర్ణముఖి నదిలో ప్రవాహం తీవ్రంగా ఉంది. నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పు తీవ్రంగా పొంచి ఉంది. వరిపంటలో కనుచూపు మేరలో నీరు పారుతండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయామని వాపోయారు.
నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో ప్రవహించే స్వర్ణముఖి నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు అక్కడకు చేరుకుని పూజలు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు తిరిగి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఏపీని కుదిపేస్తున్న మిగ్‌జాం తుపాను - స్తంభించిన జనజీవనం, అన్నదాతల్లో ఆందోళన
Water Entering the School in Doravarasatra : భారీ వర్షం కారణంగా తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండల కేంద్రంలోని కస్తూర్బ పాఠశాలలోకి నీరు చేరింది. సమీపంలోని నాగులగుంట చెరువు తెగి వరద నీరు పాఠశాలలోకి ప్రవేశించింది. దీంతో 300 మంది బాలికలు భయాందోళనకు గురయ్యారు. యేకొల్లు సర్పంచి కొడుకు, ఎస్సై తిరుమలరావులు బాలికలను ట్రాక్టర్ లో బయటకు తరలించి స్వగ్రామాలకు పంపారు. దీంతో అందరు సురక్షితంగా బయటపడ్డారు.
ఇంకా వీడని భయం..
Impact of Cyclone Michaung in AP : ఇప్పుడిప్పుడే వర్షం తెరిపిస్తున్న సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో ప్రజలను ముంపు భయం వీడలేదు. అలాగే స్వర్ణముఖిలో ప్రవాహ ఉద్ధృతి తగ్గు ముఖం పట్టలేదు. ముంపు గ్రామాల్లో పరిస్థితులు యథాతథ స్థితికి రాలేదు. శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట నియో జకవర్గాల్లో 12 వేల హెక్టార్లలో వరి నీట మునిగింది.
పంచభూత క్షేత్రమైన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఏడు గంగమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా శ్రీకాళహస్తిలో ఏడు ప్రాంతాలలో ఏడు గంగమ్మలు కొలువ తీర్చి జాతర నిర్వహించడం ఆనవాయితిగా వస్తుంది. జాతరను పురస్కరించుకొని ఏడు గంగమ్మల ఆలయం నుంచి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో అమ్మవారు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. పెండ్లి మండపం వద్ద పొన్నాలమ్మ, కొత్తపేటలో భువనేశ్వరిగా, గాంధీ వీధిలో అంకమ్మగా, జయరామారావు వీధులో కావమ్మగా, బేరువారి మండపం వద్ద ముత్యాలమ్మగా, రాజగోపురం వద్ద అంకాలమ్మగా, చేరు వీధిలో నల్ల గంగమ్మగా అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. బుధవారం రాత్రి పట్టణ ఉత్సవం నిర్వహించనున్నారు.
వరి రైతు వెన్నువిరిచిన 'మిగ్‌జాం' - నిండా మునిగి దిక్కుతోచని స్థితిలో అన్నదాత