ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరపత్రాలు పంచొద్దు..! మైక్ వాడొద్దు..! తిరుపతి టీడీపీ సభలో పోలీసుల అత్యుత్సాహం..! - తిరుపతిలో ఇదేం కర్మ కార్యక్రమం

Idhem karma Program Obstructed by Police: తిరుపతి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేపట్టిన ఇదేం కర్మ కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. కరపత్రాల పంపిణీని అడ్డగించి మైకుకు అనుమతి ఇవ్వకుండా, మేళతాళాలు లేకుండా నిర్వహించుకోవాలని సూచించారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

Idhem karma Program
ఇదేం కర్మ కార్యక్రమం

By

Published : Feb 6, 2023, 7:30 PM IST

Idhem karma Program Obstructed by Police: తిరుపతి జిల్లా గూడూరు పట్టణం ఇంద్రానగర్​లో టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం కర్మ కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటికీ కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. మైక్ పర్మిషన్ ఇవ్వకుండా, మేళ తాళాలు లేకుండా నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీకి ఒక న్యాయమా అంటూ.. అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టామని.. పోలీసులు అడ్డుకొని ఆంక్షలు విధించడం సబబు కాదని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details