Huge Problems in Government Welfare Hostels :వెనుకబడిన తరగతుల విద్యార్థుల భవిష్యత్తుని నిర్దేశించే ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు సమస్యలకు నిలయంగా మారాయి. కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంక్షేమ వసతి గృహాలు కాస్తా.. సంక్షోభ గృహాలుగా తయారయ్యాయి. తినే తిండి నుంచి పడుకునే స్థలం వరకు ప్రతిదీ విద్యార్థులకు సమస్యగానే మారింది. సరైన తిండి లేక, కంటికి సరిపడా నిద్రలేక, అపరిశుభ్ర వాతావరణంలోనే అర్ధాకలితో విద్యనభ్యసిస్తున్నారు తిరుపతిలోని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు.
Government Hostels Situation Under CM Jagan Ruling :పెచ్చులు వీడిన పైకప్పులు, పరిశుభ్రత లేని మరుగుదొడ్లు, లీకేజీ నీటి పైపులు.. అంతేనా కిటికీలు లేని తలుపులు, పని చేయని ఫ్యానులు, డొక్కు ఇనుప పెట్టెలు.. వీటన్నిటిని చూసి.. ఇదేదో పాడుపడిన భవంతి అనుకుంటే పొరపాటే.. తిరుపతిలోని వెనుకబడిన తరగతుల విద్యార్థులు ఉంటున్న సంక్షేమ వసతి గృహంలోని పరిస్థితి. ప్రయివేటు విద్యా సంస్థల్లో చదివించే స్థోమత లేక.. తమ చిన్నారులను తల్లిదండ్రులు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చేరుస్తున్నారు. కానీ ఇక్కడ సంక్షేమ వసతి గృహాలు కాస్తా.. సంక్షోభ వసతి గృహాలుగా తయారయ్యాయి. మాట్లాడితే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అనే ఊదరగొట్టే వైసీపీ ప్రభుత్వం.. కనీసం ఆ వర్గాల విద్యార్థుల సమస్యల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇక్కడి సమస్యలతో ఓ చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు ఈ విద్యార్థులు.
ఏడు వందల మందికి 5 బాత్రూమ్లు-వాటిని మాతో కడిగిస్తున్నారు : గిరిజన విద్యార్థులు