ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

High Court on TTD Board Members: తితిదే బోర్డు సభ్యుల నియామకంపై పిల్​.. ప్రభుత్వాన్ని వివరణ కోరిన హైకోర్టు - TTD Board Members Appointment

High Court on TTD Board Members: తితిదే బోర్డు సభ్యులుగా అనర్హులను నియమించారని హైకోర్టులో వేసిన పిల్​పై విచారణ జరిగింది. ఈ మేరకు ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. ఇంకా శిక్ష వేయకపోవడం వల్ల నేరస్థులుగా పరిగణించలేమని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

High Court on TTD Members
High Court on TTD Members

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 13, 2023, 7:26 PM IST

High Court on TTD Board Members: తితిదే బోర్డు సభ్యులుగా అనర్హులను నియమించారని హైకోర్టులో వేసిన పిల్​పై నేడు విచారణ జరిగింది. తితిదే పాలకమండలి నియామకాలను సవాల్ చేస్తూ.. కొద్ది రోజుల క్రితం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నేరచరితులను, లిక్కర్ కేసులో నిందితులు తితిదే బోర్డులో నియమించడాన్ని సవాల్ చేస్తూ.. రైల్వే మాజీ ఉద్యోగి వెంకటేశ్వర్లు పిల్ వేశారు.

ఉదయభాను, కేతన దేశాయ్, శరత్ చంద్రారెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ పిల్ (PIL against TTD Board Members Appointment) దాఖలైంది. దీనిపై నేడు వాదనలు జరిగాయి. పిటిషనర్ తరఫున వాదనలు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. అనర్హులను తితిదే బోర్డు సభ్యులుగా నియమించడం చట్ట విరుద్దమని న్యాయవాది జడ శ్రావణ్ వాదించారు. దీనిపై తితిదే సభ్యుల నియామకంపై హైకోర్టు వివరణ కోరింది.

Liquor Scam Accused Sarath Chandra Reddy in TTD Board టీటీడీ బోర్డు మెంబర్​గా దిల్లీ లిక్కర్‌ కేసు అప్రూవర్​ శరత్‌ చంద్రారెడ్డి

ప్రభుత్వాన్ని వివరణ కోరిన హైకోర్టు:తితిదే బోర్డు సభ్యుల నియామకంపై హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీనిపై స్పందించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది.. శిక్ష ఇంకా విధించని కారణంగా వారిని నేరస్థులుగా పరిగణించలేమని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. దిల్లీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Medical Council of India) సభ్యత్వం నుంచి తొలగించిన కేతన దేశాయ్​ను తితిదే సభ్యుడిగా నియమించారని ధర్మాసనం దృష్టికి న్యాయవాది జడ శ్రావణ్ తీసుకువచ్చారు.

దిల్లీ లిక్కర్ స్కామ్​లో (Delhi liquor scam) శరత్ చంద్రారెడ్డి (Sarath Chandra Reddy as TTD Board Member) విచారణ ఎదుర్కొంటున్నారని, ఎమ్మెల్యే ఉదయభానుపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ తెలిపారు. కౌంటర్ ధాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశించింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

Petition In High Court On Appointments of TTD Members: ఆ ముగ్గురిని తొలగించండి.. టీటీడీ పాలకమండలి నియామకాలపై హైకోర్టులో పిటిషన్

TTD Board Members Appointment Issue: గత నెల 25వ తేదీన తితిదే బోర్డు సభ్యులుగా మొత్తం 24 మందిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే అందులో క్రిమినల్ కేసులు ఉన్న ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, లిక్కర్ స్కామ్​లో ఆరోపణలు ఎదుర్కొన్న శరత్ చంద్రారెడ్డి, కేతన్ దేశాయ్​లను బోర్టు సభ్యులుగా నియమించింది. ఈ ముగ్గురినీ టీటీడీ బోర్డు సభ్యుల నుంచి తక్షణమే తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తితిదే బోర్డు సభ్యుల నియామకాల అంశం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉండటంతో.. ఇప్పటికే దీనిపై హిందూ సంఘాలు, వేంకటేశ్వర స్వామి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నియామకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

High Court Hearing on TTD Board Members Appointment: 'వారి నియామకం భక్తుల మనోభావాలకు విరుద్ధం'.. తితిదే సభ్యుల నేరచరిత్రపై హైకోర్టులో విచారణ

ABOUT THE AUTHOR

...view details