ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Heavy Devotee Rush in Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. కిలోమీటర్ల మేర భక్తుల పడిగాపులు.. కనీస సౌకర్యాలు లేవని ఆగ్రహం - తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

Heavy Devotee Rush in Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గోవింద నామస్మరణలతో తిరుగిరులు మార్మోగుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. నందకం అతిథి గృహం వరకు భక్తులు వేచి ఉన్నారు. నాలుగు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో పడిగాపులు గాస్తున్నారు. దర్శనానికి చాలా సమయం పడుతుండటంతో కొంత మంది భక్తులు తిరుమలేశుడిని దర్శించుకోకుండానే వెనుదిరుగుతున్నారు.

Heavy Devotee Rush in Tirumala
Heavy Devotee Rush in Tirumala

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 1, 2023, 5:04 PM IST

Updated : Oct 1, 2023, 10:01 PM IST

Heavy Devotee Rush in Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. తిరుగిరులు రెండు రోజులగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేవ దేవుని దర్శనం కోసం.. వేలాదిమంది భక్తులు తరలిరావడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లు,నారాయణ గిరి షెడ్లు నిండిపోయాయి. తమిళులు అత్యంత పవిత్ర మాసంగా భావించే పెరటాసి రెండో వారం రావడంతో భక్తులు అశేషంగా స్వామివారి దర్శనానికి తరలివచ్చారు.

దీంతో శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. రద్దీ పెరిగిపోవడంతో రోజుల తరబడి నిరీక్షించలేక భక్తులు నిరాశతో దర్శనం చేసుకోకుండా వెనుతిరుగుతున్నారు. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉన్న చంటి పిల్లలు, వృద్దులకు అన్నప్రసాదాలు, పాలు సరఫరా చేయకపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Huge Devotees At Tirumala Tirupati శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. తిరుమల శ్రీవారి దర్శనానికి 48 గంటలు

Huge Pilgrim Crowd at Sri Venkateswara Swamy Vaari temple: తిరుమల గిరులు జనసంద్రమయ్యాయి. శ్రీవారి దర్శనానికి (Tirumala Srivari Darshan) భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామివారి దర్శనానికి భక్తులు అధికంగా వస్తున్నారు. తమిళులకు అత్యంత పవిత్రమైన పెరటాసి మాసం రెండో వారం కావడంతో జనాలు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు నిండి నాలుగు కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు.

మేము నాలుగు రోజులుగా నడుచుకుంటూ వచ్చాము. ఎంతో ఆకలితో ఉన్నాము. ఇప్పుడు ఏమో తినడానికి లేదు.. అక్కడ ఇస్తారు అంటూ పొమ్మంటున్నారు. భోజనం లేకుండా ఎలా ఉండాలి. - భక్తుడు

కేవలం నీళ్లు మాత్రమే ఇస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫుడ్ ఉన్నా కూడా పెట్టడం లేదు. ముందున పెడుతున్నారు అని, దర్శనం టైం అయిపోతుంది అని పంపించేస్తున్నారు. మేము ఉదయం ఆరు గంటలకు వచ్చాము. ఇప్పుడు పది అయింది. ఇప్పటి వరకూ ఎటువంటి ఆహారం ఇవ్వలేదు. - భక్తుడు

TTD Tirumala Navaratri Brahmotsavam Schedule 2023 : తిరుమల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇలా.. ఎప్పట్నుంచి అంటే..?

Heavy Devotee Rush in Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. కిలోమీటర్ల మేర భక్తుల పడిగాపులు.. కనీస సౌకర్యాలు లేవని ఆగ్రహం

తిరుమల ఔటర్ రింగు రోడ్డు క్యూలైను నిండి గోగర్భం జలశయం మీదుగా నందకం అతిధి గృహం వరకు భక్తులు బారులు తీరారు. పెరటాసి మాసం రెండో వారంతో పాటు వరుస సెలవుదినాలు కలిసి రావటంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. రద్దీ పెరిగిపోవడంతో క్యూ లైన్ల వద్ద స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు, చంటి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.

మేము రాత్రి 10 గంటల సమయం లైన్​లో ఉన్నాము. కొంచెం కూడా లైను ముందుకు కదలలేదు. ఇంకో రెండు, మూడు రోజులు పడుతుంది అంటున్నారు. చిన్న పిల్లలతో రాత్రి మొత్తం వర్షంలో ఉన్నాము. ఇంక చేసేది ఏంలేక బయట నుంచే మొక్కుకొని వెళ్లిపోతున్నాము. - భక్తురాలు

Pournami Garuda Seva in Tirumala: వైభవంగా తిరుమలేశుడి పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో రద్దీ కారణంగా గదుల వసతుల (Accommodation at Tirumala) కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్తగా ఏర్పాటు చేసిన క్యూలైన్లలో మరుగుదొడ్లు లేక మహిళలు ఇబ్బందులు పడ్డారు. క్యూలైన్ల వద్ద సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. క్యూలైన్లు వద్ద గంటల తరబడి వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, చంటి పిల్లలకు పాలు వంటివి అందించకపోవడంతో పిల్లలు ఆకలితో ఇబ్బందిపడ్డారు. మరి కొందరు స్వామివారి దర్శనానికి రెండు రోజులు పట్టడంతో వెనుతిరుగుతున్నారు.

మేము తెలంగాణ నుంచి వచ్చాము. రెండు రోజులు అయింది మేము వచ్చి. కాలి నడకన వచ్చాము. ఇక్కడకి వస్తే రూములు లేవు అన్నారు. కొండ కిందనే రూములు తీసుకుని ఉంటున్నాము. ఏమైనా ఫుడ్ ఇస్తే బాగుండేది. -భక్తుడు

TTD Tirumala Seva Tickets for December : డిసెంబర్​లో తిరుమల వెళ్లే వారికి గుడ్​న్యూస్​.. శ్రీవారి సేవా టికెట్ల షెడ్యూల్ విడుదల.!

Last Updated : Oct 1, 2023, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details