ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బర్డ్‌ చిన్నపిల్లల ఆసుపత్రికి హెచ్‌సీఎల్‌ అధినేత భారీ విరాళం - donation to birds childrens hospita

HCL CHIEF DONATION హెచ్‌సీఎల్‌ అధినేత శివనాడార్‌ ధాతృత్వం చాటుకున్నారు. తితిదే ఆధ్వర్యంలోని బర్డ్‌ చిన్నపిల్లల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి కోటి రూపాయలు అందజేశారు.

HCL CHIEF DONATION
HCL CHIEF DONATION

By

Published : Aug 26, 2022, 10:45 AM IST

DONATION తితిదే ఆధ్వర్యంలోని బర్డ్‌ చిన్నపిల్లల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి హెచ్‌సీఎల్‌ అధినేత శివనాడార్‌ రూ.కోటి విరాళంగా అందజేశారని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి, గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ రోష్ని నాడార్‌, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు.

శ్రీవాణి ట్రస్టు ద్వారా 1342 ఆలయాల నిర్మాణం
శ్రీవాణి ట్రస్టు ద్వారా సనాతన హైందవ ధర్మ వ్యాప్తి, మత మార్పిడులను అరికట్టేందుకు 1342 ఆలయాలు నిర్మించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా సమరసత సేవా ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈ మేరకు తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో గురువారం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details