AP Governor Biswabhushan Harichandan: అత్యాధునిక పరిజ్ఞానం, అత్యంత నైపుణ్యం కలిగిన మానవ శక్తిని అందించడం మన లక్ష్యం కావాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విశ్వవిద్యాలయాలకు పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 19, 20వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పీహెచ్డీ, ఎంఫిల్ పూర్తైన అభ్యర్థులకు పట్టాలను అందజేశారు. శాస్త్రీయ నృత్యకారిణి, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత పద్మజా రెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.
'అధ్యాపకులు కొత్త పద్ధతులలో బోధనలకు సన్నద్ధం కావాలి' - అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
AP Governor: భారత విద్యావ్యవస్థ అతిపెద్దదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాబోయే తరాలలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడాలని సూచించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి బంగారు పతకాలను, నగదు బహుమతులను అందజేశారు. మారుతున్న కాలానుగుణంగా ఉన్నత విద్యాసంస్థలు మెరుగైన విద్యా విజ్ఞానాన్ని అందించడానికి కృషి చేయాలని గవర్నర్ సూచించారు. పాఠ్యంశాల బోధన, పరిశోధనలు నిరంతరం జరిగినప్పుడే.. ఉన్నత విద్య రాణిస్తుందన్నారు. ఉమ్మడి బోధన, వర్చువల్ లెర్నింగ్, ఉపన్యాసాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్థలు విజ్ఞానాన్ని పంచుకోవాలని తెలిపారు. అధ్యాపకులు కొత్త పద్ధతులలో బోధనలకు సన్నద్ధం కావాలన్నారు. పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే స్థాయిలో ఉందని అన్నారు.
ఇవీ చదవండి: