ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Ghee manufacturing centre: దేశీయ ఆవు పాలతో నెయ్యి తయారీ కేంద్రం - దేశీయ ఆవు పాలతో నెయ్యి తయారీ కేంద్రం వార్తు

Ghee manufacturing centre: తిరుమల స్వారివారి కైంకర్యాలకు దేశీయ ఆవుపాలతో తయారు చేసిన నెయ్యి, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వాడనున్నట్లు.. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ముంబయికి చెందిన అఫ్కాన్స్‌ సంస్థ రూ.3కోట్ల వ్యయంతో నెయ్యి తయారీ ప్లాంట్‌ నిర్మించనుందని తెలిపారు.

TTD Chairman YV Subbareddy
దేశీయ ఆవు పాలతో నెయ్యి తయారీ కేంద్రం

By

Published : Apr 16, 2022, 9:24 AM IST

Ghee manufacturing centre: ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను, దేశీయ ఆవుపాలతో నెయ్యి తయారు చేసి స్వామివారి కైంకర్యాలకు వాడనున్నట్లు.. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తితిదే ఎస్వీ గోసంరక్షణ శాలలో నెయ్యి తయారీ కేంద్రానికి శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామివారి ఆలయంలో కైంకర్యాలకు, దీపారాధన, అన్న ప్రసాదాల తయారీకి రోజుకు 60 కిలోల నెయ్యి అవసరం అవుతుందని చెప్పారు.

నెయ్యి తయారీ కేంద్రానికి భూమి పూజ చేస్తున్న తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

ముంబయికి చెందిన అఫ్కాన్స్‌ సంస్థ రూ.3కోట్ల వ్యయంతో నెయ్యి తయారీ ప్లాంట్‌ నిర్మించనుందని తెలిపారు. గోశాలలోని దేశీయ గోవుల నుంచి రోజుకు 4వేల లీటర్ల పాలను సేకరించి నెయ్యి తయారీ కేంద్రానికి ఇస్తారని చెప్పారు.

దేవుణ్ని రాజకీయాల్లోకి లాగుతున్నారు..మూడు రోజులకు ముందు జరిగిన భక్తుల తోపులాట గురించి విలేకరులు ప్రశ్నించగా ప్రధాన ప్రతిపక్షం, దానికి వంతుపాడుతున్న మీడియా దేవుడ్ని సైతం రాజకీయాల్లోకి లాగుతోందన్నారు. సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో కొంత తోపులాట జరిగినా దేవుడి దయవల్ల ఎవరికి ప్రాణాపాయం జరగలేదన్నారు. ఘటన జరిగిన గంటలోపే టోకెన్లు లేకుండా భక్తులను తిరుమలకు అనుమంతిచేలా అధికారులకు ఆదేశాలు జారీచేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని వెల్లడించారు. తెదేపా పాలనలో ఇలాంటి ఘటనలు జరగలేదా, భక్తులు కంపార్టుమెంటు గేట్లు విరిచిన సంఘటనలు గుర్తులేవా అని ప్రశ్నించారు. భక్తుల సౌకర్యార్థం మరో రెండు అన్నప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఈవో జవహర్‌రెడ్డి, ఎస్వీ గోశాల సంచాలకులు డాక్టర్‌ హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్వామి సేవలో 82,722 మంది భక్తులు..తిరుమల శ్రీవారిని సర్వదర్శనం క్యూలైన్లలో భక్తులు భారీగా దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి లేపాక్షి కూడలి వరకు భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి అత్యధికంగా రూ.5.11 కోట్ల హుండీ కానుకలు లభించాయి. గురువారం శ్రీవారిని 82,722 మంది భక్తులు దర్శించుకున్నారు.

ఇదీ చదవండి:

vontimitta : వైభవంగా రామయ్య కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం

ABOUT THE AUTHOR

...view details