FORMER CJI JUSTICE NV RAMANA : తిరుమల శ్రీవారిని.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు.. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి.. స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన మూలమూర్తిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి సేవలో పాల్గొన్న మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు - తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
FORMER CJI JUSTICE : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ఈవో, తితిదే ఛైర్మన్ స్వాగతం పలికారు.
FORMER CJI JUSTICE NV RAMANA
రంగనాయకులు మండపంలో వేదపండితులు.. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు వేదాశీర్వచనం పలికారు. దర్శనానంతరం తితిదే ఛైర్మన్, ఈవో.. స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు అందజేశారు. తర్వాత.. బేడీ ఆంజనేయస్వామివారిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు.. అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టారు.
ఇవీ చదవండి: