ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వరాలయంలో బ్రెజిల్ భక్తులు.. ప్రత్యేక పూజలు - శ్రీకాళహస్తీశ్వర ఆలయం

Foreigners Perform Rahu Ketu Pooja: బ్రెజిల్​కు చెందిన 22 మంది భక్తులు తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. సాంప్రదాయ వస్త్రాలను ధరించి ఆలయంలో నిర్వహించే రాహు, కేతు, సర్పదోష నివారణ పూజలలో పాల్గొన్నారు. విదేశీ భక్తులతో ఫోటోలు తీసుకునేందుకు స్థానిక భక్తులు పోటీపడ్డారు.

Foreigners Perform Rahu Ketu Pooja
Foreigners Perform Rahu Ketu Pooja

By

Published : Dec 5, 2022, 7:31 PM IST

Rahu Ketu Pooja in Srikalahasti Temple: శ్రీకాళహస్తీ ఆలయం విదేశి భక్తులతో కళకళలాడింది. బ్రెజిల్​కు చెందిన భక్తులు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహు కేతు సర్ప దోష నివారణ పూజల్లో పాల్గొన్నారు. బ్రెజిల్​కు చెందిన 22 మంది భక్తులు సాంప్రదాయ వస్త్రాలను ధరించి ఆలయంలో నిర్వహించే రాహు కేతు సర్ప దోష నివారణ పూజలలో పాల్గొన్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

ఆలయ మండపాలు గోపురాలను ఆసక్తిగా వీక్షించి.. దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. వీరికి ఆలయ సిబ్బంది, అధికారులు బ్రెజిల్​కు చెందిన భక్తులకు ఆలయ విశిష్టతను తెలియజేశారు. విదేశీ భక్తులతో ఫోటోలు తీసుకునేందుకు స్థానిక భక్తులు పోటీపడ్డారు.

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో బ్రెజిల్ భక్తులు

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details