ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనవరి 14, 15 తేదీల్లో గాలిపటాలు ఎగరేయడం నిషేధం.. ఎక్కడంటే? - Andhra Pradesh festival news

Flying Kites In Hyderabad: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌లో జనవరి 14, 15 తేదీల్లో గాలిపటాలను ఎగరేయడాన్ని నిషేధిస్తూ..కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సంక్రాంతి పండుగ నియమాలను వెల్లడించారు. ప్రార్థన స్థలాల చుట్టుపక్కల ప్రాంతాల్లో గానీ, రహదారులపై గానీ గాలిపటాలను ఎగరేయడాన్ని నిషేధించమన్నారు.

సంక్రాంతి పండగ
Sankranthi guidelines

By

Published : Jan 13, 2023, 8:34 PM IST

Prohibition Of Flying Kites In Special Places In Hyderabad: సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 14, 15 తేదీల్లో ప్రార్థన స్థలాల చుట్టుపక్కల ప్రాంతాలు, రహదారులపై గాలిపటాలు ఎగరేయడం నిషేధమని హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. శాంతి భద్రతలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో పోలీసుల అనుమతి లేకుండా డీజేలు, లౌడ్‌ స్పీకర్లు ఉపయోగించొద్దని ఆదేశించారు.

భోగి మంటల కోసం బలవంతంగా కలపను సేకరించొద్దని, యజమానుల అంగీకారంతోనే తీసుకోవాలని సూచించారు. ఈ నెల 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ ఉదయం 6 వరకూ తామిచ్చిన ఆదేశాలు అమల్లో ఉంటాయని, ఉల్లంఘించిన వారిపై హైదరాబాద్‌ పోలీసు చట్టం ప్రకారం చర్యలుంటాయని నోటిఫికేషన్‌ జారీ చేశారు. అందులోని వివరాలివీ..!

అమల్లో ఉండే నిబంధనలు:

  • బహిరంగ ప్రదేశాల్లో రెచ్చగొట్టే ఉపన్యాసాలు, సంగీతంపై నిషేధం.
  • బహిరంగ సమావేశాల్లో వక్తలు, ఇతర మైకుల శబ్దాలు పరిమితి దాటొద్దు. వాణిజ్య ప్రాంతాల్లో ఉదయం 65, రాత్రి 55 డెసిబుల్స్‌ దాటొద్దు.
  • నివాస ప్రాంతాల్లో ఉదయం 55, రాత్రి 45 డెసిబుల్స్‌ దాటొద్దు.
  • సున్నిత ప్రాంతాల్లో ఉదయం 50, రాత్రి 40 డెసిబుల్స్‌ మించొద్దు.
  • సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ రెండు రోజులు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌ స్పీకర్లు అనుమతించబోం.
  • ప్రహరీ లేని మేడలపై చిన్నారులు పతంగులు ఎగరేయకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలి.
  • తెగిన గాలిపటాల కోసం చిన్నారులు రహదారులు, ఇతర ప్రాంతాల్లో పరుగెత్తకుండా.. విద్యుత్‌ స్తంభాలకు వేలాడే వాటిని తీసుకోకుండా అవగాహన కల్పించాలి.

చైనా మాంజాలపై నిషేధం:సంక్రాంతి పండగ వచ్చిందంటే అంటే చాలు చిన్నాపెద్దా అందరూ రంగురంగుల పతంగులను ఎగరవేయడానికి ఇష్టపడతారు. పోటాపోటీగా గాలిపటాలను ఎగరవేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధపడతారు. అయితే ఈ గాలి పటాలకు ఉపయోగించే మాంజాపై అప్రమత్తంగా ఉండాలంటోంది అటవీ శాఖ. ఎందుకంటే పర్యావరణానికి హాని కలిగించే.. సింథటిక్‌ చైనీస్‌ మాంజా వల్ల మానవులకు, మూగజీవులకు, పక్షులకు హాని కలుగుతుందని వాటిని వాడవద్దని అధికారులు సూచిస్తున్నారు. చైనా మాంజాల వాడకాన్ని జాతీయహరిత ట్రైబ్యునల్​ ఉత్తర్వుల- 2016 ప్రకారం నిషేధించామని.. వాటిని విక్రయిస్తే చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.

చైనా మాంజా విక్రయిస్తే ఐదేళ్ల ఖైదు, లక్ష జరిమానా ఉందని తెలిపారు. మాంజా వాడకం వల్ల మనుషులకు, పక్షులకు హాని జరిగితే 3 నుంచి 7 ఏళ్ల దాకా జైలు శిక్ష రూ.10 వేల జరిమానా విధిస్తారని అధికారులు తెలిపారు. ఎవరైనా ఈ మాంజాను ఉపయోగిస్తే అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్లు 040 -23231440, 1800 4255 364 లకు ఫోన్​ చేసి తెలియజేయాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details