ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TTD: ఆ ఉద్యోగి స్నేహితుడి వల్లే సినిమా పాటలు: తితిదే - ఏపీ వార్తలు

TTD: శ్రీవారి భక్తి కార్యక్రమాలు ప్రసారం కావాల్సిన తెరపై.. పాటలు రావటంతో భక్తులు విస్మయానికి గురయ్యారు. దీనిపై.. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందించారు. తొలుత సాంకేతిక సమస్యగా గుర్తించాం. ప్రాథమిక విచారణలో బ్రాడ్‌కాస్ట్‌లో పనిచేసే ఉద్యోగి.. తన స్నేహితుడిని బ్రాడ్‌కాస్ట్‌ గదిలోకి తీసుకెళ్లాడని తేలింది.

film songs telecasted by mistake in ttd
బ్రాడ్‌కాస్ట్‌ ఉద్యోగి స్నేహితుడి తప్పిదంతోనే సినిమా పాటలు: తితిదే

By

Published : Apr 24, 2022, 9:22 AM IST

TTD: తిరుమలలో శుక్రవారం సాయంత్రం ఎల్‌ఈడీ తెరపై ప్రసారమైన సినిమా పాటల వివాదంపై.. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందించారు. 'తొలుత సాంకేతిక సమస్యగా గుర్తించాం. ప్రాథమిక విచారణలో బ్రాడ్‌కాస్ట్‌లో పనిచేసే ఉద్యోగి.. తన స్నేహితుడిని బ్రాడ్‌కాస్ట్‌ గదిలోకి తీసుకెళ్లాడని తేలింది. అత్యవసర పనిపై స్నేహితుడిని అక్కడే ఉంచి ఆయన వైకుంఠం-2 వరకు వెళ్లారు. ఉద్యోగి స్నేహితుడు అక్కడున్న రిమోట్‌తో ఆపరేట్‌ చేయడంతో ఇలా జరిగిందని గుర్తించాం. పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని ధర్మారెడ్డి తెలిపారు.

Movie Songs at tirumala: తిరుమలలో శ్రీవారి భక్తి పాటలు, స్వామి వారి సేవలతో రూపొందించిన లఘు చిత్రాలు ప్రసారం చేసేందుకు ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ తెరపై.. సినిమా పాటలు ప్రసారమయ్యాయి. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద భక్తులు సేద తీరే షెడ్‌లో ఉన్న ఎల్‌ఈడీ తెరపై.. శుక్రవారం సాయంత్రం 5 గంటల 45నిమిషాల నుంచి 6 గంటల15నిమిషాల వరకు సినిమా పాటలు, వ్యాపార ప్రకటనలు ప్రసారమయ్యాయి. శ్రీవారి భక్తి కార్యక్రమాలు ప్రసారం అవ్వాల్సిన తెరపై.. పాటలు రావటంతో భక్తులు విస్మయానికి గురయ్యారు.

ABOUT THE AUTHOR

...view details