Ali comments on Pawan Kalyan: రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధిష్ఠానం ఆదేశిస్తే, పవన్‌కల్యాణ్‌పై పోటీ చేయడానికి తాను సిద్ధమని నటుడు అలీ అన్నారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరని సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ అన్నారు. తాజాగా తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘పవన్‌కల్యాణ్ నాకు మంచి మిత్రుడు. అయితే, సినిమాలు, రాజకీయం రెండూ వేరని తెలిపారు.
పవన్‌కల్యాణ్‌పై పోటీకి సిద్ధం: అలీ - సినినటుడు ఆలీ వార్తలు
14:48 January 17
2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 175 సీట్లలో వైసీపీ విజయం ఖాయం
ముఖ్యమంత్రి ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తా..: చిత్తూరు జిల్లా నగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా.. మంత్రి రోజాతో పాటు సినీ నటుడు రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా చైర్మెన్ ఆలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కోటికి సిద్ధమని ప్రశ్నించగా ఆయన నవ్వుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోటీ చేయాలని ఆదేశిస్తే తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని నవ్వుతూ సమాధానం ఇవ్వడం.
'నగిరికి రోజాగారు ముగ్గుల పోటీలను చూసేందుకు పిలవడంతో వచ్చాను. ఇక్కడికి రావడం ఆనందాన్ని ఇచ్చింది. మా ముఖ్యమంత్రి గారు అభివృద్ది ఫలాలు అందరికి అందేలా చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో గెలవడం ఖాయం. నగరిలో రోజా గెలుస్తుందని నమ్ముతున్నాను. జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావడం గ్యారెంటీ. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడినుంచి పోటీ చేస్తాను.' -ఆలీ,రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా చైర్మెన్
ఇవీ చదవండి: