ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఆద్యంతం నేత్ర పర్వంగా సాగిన గరుడ వాహన సేవ - గరుడ వాహన సేవ

Tirumala: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడసేవ ఆద్యంతం నేత్ర పర్వంగా సాగింది. తిరుమాఢ వీధుల్లో గరుత్మంతునిపై ఊరేగుతూ.. స్వామివారు భక్తులను కటాక్షించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన ఈ వాహనసేవలో.. మూడు లక్షల మందికిపైగా భక్తులు పాల్గొన్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Oct 2, 2022, 7:08 AM IST

Updated : Oct 2, 2022, 9:10 AM IST

Tirumala Garudavahana seva: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు విశిష్టమైన గరుడవాహనసేవ కన్నుల పండువగా సాగింది. తిరువీధుల్లో విహరిస్తున్న స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు నిత్య వాహనం కావడంతో.. ఈ సేవను తిలకిస్తే సర్వ దోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. దాదాపు నాలుగున్నర గంటల పాటు వాహన సేవ జరగ్గా.. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. అటు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

గరుడవాహన సేవలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, భారత ప్రభుత్వ రక్షణ శాఖ సాంకేతిక సలహదారు సతీష్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మాఢవీధుల్లో తితిదే ప్రయోగాత్మకంగా చేపట్టిన దర్శనంలో చిన్నపాటి అవాంతరాలు ఎదురయ్యాయి. వెంగమాంబ అన్నదాన సత్రం సమీపంలో క్యూలైన్ల కోసం ఏర్పాటు చేసిన ఇనుప కంచె కిందపడిపోయింది. వాహనసేవ దర్శనానికి భక్తులను అనుమతించే సమయంలో ఇక్కడ చిన్నపాటి తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఎలాంచి అవాంచనీయ ఘటన జరగలేదు. పోలీసులు వెంటనే పరిస్థితిని చక్కదిద్దారు.

ఆద్యంతం నేత్ర పర్వంగా సాగిన గరుడ వాహన సేవ

ఇవీ చదవండి:

Last Updated : Oct 2, 2022, 9:10 AM IST

ABOUT THE AUTHOR

...view details