Road accident in Tirupati: తిరుపతి నగరంలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కూడలిలో రోడ్జు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో రెండు సంవత్సరాల చిన్నారితో పాటు ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. తుమ్మలగుంటకు చెందిన రుద్రకుమార్ తన భార్య మీనా, కుమారుడు చందుతో కలిసి ద్విచక్ర వాహనంపై తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగింది. నాయుడుపేట - పూతలపట్టు జాతీయ రహదారి నుంచి తిరుపతికి వస్తున్న టిప్పర్ మహిళా విశ్వవిద్యాలయం కూడలిలో మలుపు వద్ద రుద్రకుమార్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని అధిగమించే క్రమంలో ఢీకొట్టింది. ద్విచక్ర వాహనం నుంచి రుద్రకుమార్ ఆయన భార్య మీనా కుమారుడు చందు కింద పడిపోయారు. కిందపడిన మీనా, చందుపై నుంచి టిప్పర్ వెళ్లడంతో ఇద్దరూ సంఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయారు. రుద్రకుమార్ ప్రమాదం నుంచి బయటపడ్డారు.
తిరుపతిలో ప్రమాదం.. రెండేళ్ల చిన్నారి, తల్లి పైనుంచి దూసుకెళ్లిన టిప్పర్ - AP Highlights
Road accident in Tirupati: తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రెండేళ్ల చిన్నారితో పాటు తల్లి మృతి చెందింది. తుమ్మలగుంటకు చెందిన వ్యక్తి భార్య, కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై నగరంలోకి వస్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. ఘటనలో భార్య, కుమారుడిపై టిప్పర్ దూసుకెళ్లగా అక్కడికక్కడే మృతి చెందారు.
Road accident in Tirupati