EO DHARMARDDY: ఈ నెల 11న నిర్వహించనున్న తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని 3 కేంద్రాల్లో ఎప్పటి నుంచి జారీ చేయాలనే విషయంపై చర్చించి స్పష్టమైన ప్రకటన చేస్తామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. శనివారం స్థానిక అన్నమయ్య భవనంలో తితిదే డయల్ యువర్ ఈవో కార్యక్రమం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
* తిరుమలలో గదులు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. ప్రస్తుతానికి తిరుమలలోని 50 శాతం గదులను ఆన్‌లైన్‌లో, 50 శాతం గదులను ఆఫ్‌లైన్‌లో కేటాయిస్తున్నాం. భక్తులు వీలైనంత వరకు తిరుపతిలో తితిదే, ప్రైవేటు అద్దె గదుల్ని వినియోగించుకోవాలి.
* ప్రస్తుతం భక్తుల నుంచి నగదు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా గదుల అద్దె డిపాజిట్ స్వీకరిస్తున్నాం. తిరిగి వాటి చెల్లింపునకు కొంత సమయం పడుతుంది. త్వరలోనే యూపీఐ క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా డిపాజిట్ చెల్లింపులు చేయడాన్ని పరిశీలిస్తున్నాం.