EC action against corrupt officials : తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో నకిలీ ఓటర్లు, ఓటర్ ఐడీలు సృష్టించిన వ్యవహారంలో అప్పటి తిరుపతి రిటర్నింగ్ అధికారి, ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్‌పై వేటు వేసిన ఈసీ మరికొందరిపై కొరడా ఝుళిపించనుంది. పొరుగు రాష్ట్రాల నుంచి భక్తుల వేషంలో నకిలీ ఓటర్లు వచ్చిన అంశంపై ఫిర్యాదులు వచ్చినా చూసీచూడనట్టు వ్యవహరించటం, కేసులు పెట్టకుండా నిర్లక్ష్యం వహించడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంలో ఒకరిద్దరు పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
5.64 లక్షల ఓటర్లు ఔట్ - అనర్హులను ఏరివేసిన ఈసీ 'టీడీపీ ఫిర్యాదుకు స్పందన'
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోరుగు రాష్ట్రాల నుంచి బస్సుల్లో భారీగా వచ్చిన నకిలీ ఓటర్లు ఓట్లు వేసేశారు. దాదాపు 30వేల మందికిపైగా నకిలీ ఓటర్లు నకిలీ ఓటరు గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేయటం..అధికార పార్టీ నేతల అండతో భక్తుల ముసుగులో బస్సుల్లో తరలి రావటంపై నామ మాత్రంగా మాత్రమే కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యంపై ఈసీ దృష్టి సారించింది. నకిలీ ఓటర్లు చెక్ పోస్టులు దాటి వచ్చి మరీ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వినియోగించుకోవటంపై నివేదికలు తెప్పించుకుంది.
ప్రొద్దుటూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
ఈ వ్యవహారంపై విజయవాడలో ఇటీవల జరిగిన సమీక్షలోనూ కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ తిరుపతి జిల్లా ఉన్నతాధికారుల్ని ప్రశ్నించినట్టు సమాచారం. దీనిపై పూర్తిస్థాయిలో అప్పటి పోలీసు అధికారులు దర్యాప్తు చేయకుండా వదిలివేయటంపైనా ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నిర్లక్ష్యానికి సంబంధించి ముగ్గురు I.P.Sఅధికారుల ప్రమేయంపై విచారణ జరినట్టు సమాచారం. ఉప ఎన్నికలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై యాక్షన్ టేకెన్ రిపోర్టు ఇవ్వాల్సిందిగా డీజీపీని ఈసీ ఆదేశించింది. ఉపఎన్నికల సమయంలోనూ, అంతకుముందు విధుల్లో ఉన్న అధికారులపై విచారణ చేసి డీజీపీ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఈసీ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ఉపఎన్నిక సమయంలో అప్పటి పోలీసు ఉన్నతాధికారి నకిలీ ఓటర్లపై ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. కేసులు నమోదు చేయటంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఫిర్యాదుల మేరకు..ఆయన పై కూడా ఈసీ క్రమశిక్షణా చర్యలకు ఆదేశించినట్టు తెలుస్తోంది.
ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై స్టేకు సుప్రీం నో- కేంద్రానికి నోటీసులు
తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక పై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు హర్షనీయమని టీడీపీ నాయకులు అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ దొంగ ఓట్ల నమోదుకు పాల్పడిన ఎన్నికల అధికారులతో పాటు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య బద్దంగా ఉప ఎన్నికలు జరగలేదన్న విషయం తేటతెల్లమైందన్నారు. ఉపఎన్నికకు సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలోనే ఇతర ప్రాంతాల వ్యక్తులను తరలించారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్ల నమోదును ప్రోత్సహించిన ప్రజాప్రతినిధులకు పోటీ చేసే అర్హత లేదని హితవు పలికారు.