ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. టోకెన్లు జారీ

By

Published : Dec 31, 2022, 10:44 PM IST

Updated : Jan 1, 2023, 10:21 AM IST

Devotees Rush In Tirumala: శ్రీవారి వైకుంఠద్వార టోకెన్ల కోసం తిరుమల భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులతో రద్దీ నెలకొంది. అర్ధరాత్రి నుంచే టోకెన్లు జారీ చేస్తున్నారు. తిరుపతిలోని 9 కేంద్రాల్లో సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. రోజుకు 45 వేల టోకెన్లు చొప్పున 10 రోజులకు నాలుగున్నర లక్షల సర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.

TIRUMALA
తిరుమల

Devotees Rush In Tirumala: శ్రీవారి వైకుంఠద్వార దర్శన టోకెన్లను ప్రకటించిన సమయం కంటే 12 గంటల ముందే తిరుమల తిరుపతి దేవస్థానం జారీ ప్రారంభించింది. ఈ నెల 2 నుంచి 11 వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి తితిదే ఏర్పాట్లు చేసింది. 10 రోజుల పాటు రోజుకు 45 వేల చొప్పున 4 లక్షల 50 వేల టోకెట్లు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు టోకెట్లు జారీ చేయనున్నట్లు తొలుత తితిదే ప్రకటించింది. శనివారం సాయంత్రం నుంచి తిరుపతి నగరంలో టోకెట్లు జారీ చేసే కేంద్రాలకు భక్తులు తరలిరావడంతో ప్రకటించిన సమయం కంటే ముందే జారీ ప్రారంభించింది. తిరుపతిలోని 9 కేంద్రాల్లో.. టోకెన్ల జారీ కొనసాగుతోంది.

వైకుంఠద్వార టోకెన్ల కోసం భారీగా భక్తులు

శ్రీవారి భక్తులు నూతన సంవత్సరానికి వినూత్న రీతిలో స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు బైఠాయించి గోవిందనామస్మరణతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపారు. మహిళలు, యువత కేరింతలతో హోరెత్తించారు. డిసెంబర్‌ 31 నాడు తిరుమలలో గడపడం చాలా ఆనందంగా ఉందని భక్తులు అంటున్నారు. నూతన సంవత్సరం సందర్బంగా ఆలయానికి విద్యుద్దీపాలతో అలంకరించారు.


ఇవీ చదవండి:

Last Updated : Jan 1, 2023, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details