SILVER AMBARI : తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బెంగళూరుకు చెందిన దాతలు వెండి అంబారీలను అందజేశారు. ఏసీటీ మేనేజింగ్ డైరెక్టర్ మల్లాది బాలసుబ్రమణ్యం, మల్లాది నాగేశ్వరరావు దంపతులు వాటిని వితరణగా అందజేశారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవాలకు అనుకూలంగా కోటి ముప్పై లక్షల రూపాయలు విలువ గల వెండి అంబారీలను ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అంబారీలకు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ అధికారులు దాతలకు దర్శన ఏర్పాట్లు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
నేటి నుంచే బ్రహ్మోత్సవాలు: శ్రీకాళహస్తీశ్వరలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబయ్యింది. సోమవారం ముతో మహా శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 26 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంతో పాటు పట్టణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో శ్రీకాళహస్తి దివ్య కైలాసంగా దర్శనమిస్తుంది.