ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి చెంత దగ్గుబాటి కుటుంబం.. శ్రీకాళహస్తీలో స్టార్‌ షట్లర్‌ సింధు

Tirupati : తిరుమల శ్రీవారిని దగ్గుబాటి కుటుంబ సభ్యులు దర్శించున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. మరోవైపు శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని భారత్​ స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు దర్శించుకున్నారు.

Daggubati Family Visited
Daggubati Family Visited

By

Published : Sep 15, 2022, 4:20 PM IST

Daggubati Family Visited Tirumala : తిరుమల శ్రీవారిని సినీనటుడు రాానా, నిర్మాత సురేష్‌బాబు దంపతులు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం.. తితిదే వేదపండితులు రంగనాయకుల మండపంలో ప్రసాదాలు అందజేశారు

PV Sindhu : శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఆమెకు స్వాగతం పలికి దర్శనం చేయించారు. శ్రీ మేథోగురు దక్షిణామూర్తి సన్నిధిలో అర్చకులు సింధుకు వేద ఆశీర్వచనం అందజేశారు. తీర్థ ప్రసాదాలు జ్ఞాపికలు అందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు దక్కాలని ప్రార్థించినట్లు సింధు తెలిపారు. పూర్తిస్థాయిలో శ్రమిస్తేనే క్రీడాకారులకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. భావి క్రీడాకారులకు తనవంతు సహకారం అందిస్తానన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దగ్గుబాటి కుటుంబం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details