CPI leader NARAYANA ON HOSPITAL : తిరుపతి ప్రసూతి ఆసుపత్రి భవనాన్ని నగరపాలక సంస్థ కార్యాలయానికి కేటాయిస్తూ సీపీఐ చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. నగరపాలక సంస్థ కార్యాలయానికి కేటాయిస్తూ ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను మహిళలు తొలగించేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన మహిళలు బోర్డును తొలగించి తగలబెట్టారు. ఈ ఆందోళనలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. నగరపాలక సంస్థకు ప్రసూతి ఆసుపత్రిని కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మహిళా ద్రోహి అని దూషించారు. రాయలసీమ జిల్లాలోని పేద మహిళలకు మెరుగైన వైద్యసేవలందిస్తున్న ప్రసూతి ఆస్పత్రిని రోగులకు దూరం చేశారని ఆయన ఆరోపించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రసూతి ఆసుపత్రిని.. ఆయన తనయుడు నగరపాలక సంస్థ కార్యాలయానికి కేటాయిచడం విడ్డూరంగా ఉందన్నారు.
పేద మహిళలకు ప్రసూతి ఆస్పత్రిని దూరం చేస్తున్నారన్న సీపీఐ నేత నారాయణ
CPI NARAYANA తిరుపతి ప్రసూతి ఆసుపత్రి భవనాన్ని నగరపాలక సంస్థ కార్యాలయానికి కేటాయించడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రసూతి ఆసుపత్రిని ఆయన తనయుడు నగరపాలక సంస్థ కార్యాలయానికి కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు
CPI NARAYANA ON HOSPITAL