Couples died in Accident : తిరుపతి జిల్లాలో పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో దంపతులు మృతి చెందారు. వీరి మరణంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతి చెందిన దంపతులకు ఒక కుమార్తె ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లాలోని చిగురవాడ గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి తిరుపతికి పనిమీద వెళ్లాడు. పని ముగించుకున్న తర్వాత దంపతులు ఇద్దరు ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరారు. ఈ సమయంతో గుర్తు తెలియని వాహనం వీరి ద్విచక్ర వాహనాన్ని ఓటేరు గ్రామం సమీపంలో ఢీ కొట్టింది. దీంతో దంపతులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పొయారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి - తిరుపతి
Accident : తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు ప్రాణాలు కోల్పొయారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలోనే దంపతులు ప్రాణాలు కోల్పొవటంతో వారి గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.
రోడ్డు ప్రమాదం