PSLV C 54: తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి నేడు చేపట్టనున్న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ)-సి54 ప్రయోగానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఈరోజు ఉదయం గం.11.56నిమిషాలకు ఈ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించి గురువారం షార్‌లో రాకెట్ సన్నద్ధత, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశాలు జరిగాయి. అన్ని అంశాలను చర్చించిన పిదప ప్రయోగానికి ముందు 25.30 గంటల కౌంట్‌డౌన్ నిర్వహించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఇందులో భాగంగా నిన్న ఉదయం 10.56 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.
PSLV C 54: కాసేపట్లో నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సి54.. - శ్రీహరికోట రాకెట్ కేంద్రం
PSLV ROCKET : శ్రీ హరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈరోజు ఉదయం గంటల 11.56నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ సి54 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.
పీఎస్‌ఎల్‌వీ సి54
అలాగే భూటాన్ ఉపగ్రహ ప్రయోగం ఉండటంతో ఆ దేశానికి చెందిన శాస్త్రవేత్తల బృందం శనివారం షార్‌కు చేరుకున్నారు. షార్ నుంచి శనివారం ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ--సి54 వాహకనౌక ద్వారా బెంగళూరు స్టార్టప్‌నకు చెందిన హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి ఆనంద్ అని నామకరణం చేశారు. ఈ ఉపగ్రహం బరువు 15 కిలోలు. ఇది వాయువులు, మీథేన్ లీకులు, భూగర్భ చమురు, పంటలకొచ్చే తెగుళ్లను గుర్తించేందుకు దోహదపడుతుంది.
ఇవీ చదవండి: