ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

FLEXI: ఫ్లెక్సీల తొలగింపుపై వివాదం.. తెదేపా నేతలపై వైకాపా నాయకుల భౌతిక దాడి - తిరుపతి జిల్లా తాజా వార్తలు

FLEXI: తిరుపతి జిల్లా పుత్తూరులో తెదేపా, వైకాపా మధ్య ఆదివారం ఫ్లెక్సీలపై వివాదం ఏర్పడింది. నిన్న ఉదయం మున్సిపల్‌ యంత్రాంగం తెదేపా నేత గాలి భాను ప్రకాశ్ ఫ్లెక్సీలను తొలగించారు. దాంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. అయితే సాయంత్రం తొలగించిన ఫ్లెక్సీలను తెదేపా నాయకులు మళ్లీ ఏర్పాటు చేశారు.

FLEXI
FLEXI

By

Published : Jul 4, 2022, 8:52 AM IST

FLEXI: తిరుపతి జిల్లా పుత్తూరులో తెదేపా, వైకాపా మధ్య ఆదివారం ఫ్లెక్సీలపై వివాదం ఏర్పడింది. తెదేపా నగరి నియోజకవర్గ బాధ్యుడు గాలి భానుప్రకాష్‌ ఫ్లెక్సీలను తొలగించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఉదయం మున్సిపల్‌ యంత్రాంగం వాటిని తొలగించింది. దాంతో తెదేపా నాయకులు .. మున్సిపల్‌ కమిషనర్‌ వద్దకు వెళ్లి ప్రశ్నించినప్పుడు వారి నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం తెదేపా నాయకులు తొలగించిన ఫ్లెక్సీలను మళ్లీ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం తెదేపా నాయకులను సీఐ లక్ష్మీనారాయణ స్టేషన్‌కు పిలిపించి వాటిని తీసేయాలని సూచించడంతో వారు అంగీకరించారు. దానికనుగుణంగా మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ ఆనంద్‌, తెదేపా బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు షణ్ముగరెడ్డి తదితరులు కార్వేటినగరం రోడ్డు కూడలికి వచ్చారు. అప్పటికే అక్కడే ఉన్న వైకాపా నాయకులు ఫ్లెక్సీలను తొలగించేందుకు సన్నద్ధమయ్యారు. తామే వాటిని తొలగించుకుంటామని తెదేపా నేతలు చెప్పారు. ఈ సందర్భంగా పోలీసుల సమక్షంలోనే ఇరుపక్షాల నడుమ మాటామాటా పెరిగి తోపులాట జరిగింది. ఈ సమయంలో వైకాపా నాయకులు.. తెదేపా నాయకులపై భౌతిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం పోలీసులు తెదేపా నాయకులను స్టేషన్‌కు తరలించడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details